transco to fill 1100 junior lineman posts ట్రాన్స్ కో లో ఉద్యోగాలోచ్..! అర్హులు అప్లై చేసుకోండి..

Telangana transco invites applications for junior lineman posts

telangana, transco, juniot lineman, southern zone, northern zone, iti, electrical, wireman, vocational course, electrical pole, contract labour

telangana transco to fill 1100 junior lineman posts, invites applications from the eligible aspirants of telangana.

ట్రాన్స్ కో లో ఉద్యోగాలోచ్..! అర్హులు అప్లై చేసుకోండి..

Posted: 01/09/2018 01:35 PM IST
Telangana transco invites applications for junior lineman posts

తెలంగాణ ట్రాన్స్ కో కూడా ఎట్టకేలకు నిరుద్యోగ, కాంట్రాక్టు కార్మికులకు శుభవార్తను అందించింది. ఈ శాఖలో ఖాళీగా వున్న 1100 జూనియర్‌ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనను వెలువరించి అశావహులకు తీపికబురును అందించింది. దక్షిణ మండలంలోని (సదరన్‌ జోన్‌) 657, ఉత్తర మండలం (నార్తర్న్‌ జోన్) లో 443 ఖాళీలు ఉన్నాయని ప్రకటించింది.

అర్హతలు:

* ఎలక్ట్రికల్, వైర్ మెన్ ఐటీఐ కోర్సులు లేదా ఎలక్ట్రిషియన్ ఒకేషనల్‌ కోర్సు పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులని స్పష్టం చేసింది.
* ఈ జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచిన వారు ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలని తెలిపింది.
* రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
* అభ్యర్థులు పోల్‌ (విద్యుత్ స్థంబాలు) ఎక్కగలగాలి. స్తంభం ఎక్కలేనివాళ్లు ఈ పోస్టులకు అనర్హులు.

వయో పరమితులు:

జులై 1, 2017 నాటికి కనిష్ఠంగా 18, గరిష్ఠంగా 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు సడలింపు).
* ఇంటర్వ్యూ లేదు
* 80 మార్కులకు రాత ప‌రీక్ష‌
* తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లో ప్రశ్నపత్రం
* ఎలక్ట్రికల్‌ సబ్జెక్టుపై 65 ప్రశ్నలు ఐటీఐ/ ఒకేషనల్‌ కోర్సులోని ప్రశ్నలు
* జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి మిగిలిన 15 ప్రశ్నలు.
* పరీక్ష వ్యవధి 2 గంటలు.
* పరీక్ష కేంద్రాలన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటాయి.
* పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

అర్హత సాధించాలంటే...
రాత ప‌రీక్ష‌¹లో అర్హత సాధించడానికి ఓసీలు 40, బీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు పొందాలి. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గరిష్ఠంగా 20 మార్కుల వెయిటేజీ వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 5 నుంచి ప్రారంభమైంది
చివరితేదీ: జనవరి 20.
ఫీజు: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా రూ.100 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా చెల్లించాలి. దీంతోపాటు రూ.120 పరీక్ష ఫీజు కట్టాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
హాల్‌ టికెట్లు: ఫిబ్రవరి 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11, 2018 మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  transco  juniot lineman  iti  electrical  wireman  vocational course  

Other Articles