Dirty dozens hit new bars కటకటాల్లోకి అల్లరిమూకలు.. బ్రిగేడ్ రోడ్డులో జంటను వేధించినవాడు కూడా..

Bengaluru brigade road molester behind the bars with 24 others

Bengaluru, New Year, New Year's eve, Bengaluru molestation, Girl molested, MG Road, Brigade Road, Suneel Kumar, sadhwani junction, Bengaluru, Bangalore University, crime

Police pick up 24 trouble-makers, including a suspected molestor, from Brigade Road and send them into custody

కటకటాల్లోకి అల్లరిమూకలు.. బ్రిగేడ్ రోడ్డులో జంటను వేధించినవాడు కూడా..

Posted: 01/02/2018 10:25 AM IST
Bengaluru brigade road molester behind the bars with 24 others

బెంగళూరు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నగర వీధుల్లో డిసెంబర్ 31, 2016 నాటి ఘటనల తరువాత వచ్చిన న్యూఇయర్ కోసం పోలీసులు తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఫలించాయి. అయితే సందట్లో సడేమియాలు మాత్రం అదే పనిగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. దీంతో నగరంలో అక్కడక్కడ అవే ఘటనలు పునరావృతం అయ్యాయి. బ్రిగేడ్ రోడ్ తదితర ప్రాంతాల్లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా రెచ్చిపోయిన కొందరు అల్లరిమూకలను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

బ్రిగేడ్ రోడ్డులో పాషా అనే యువకుడు అమ్మాయిలపై పడుతూ వారిని వేధించాడు. ఈ అగంతకుడు వేధింపులను ఓ జంట కూడా ఎదుర్కొంది. దీంతో అమె తన మీడియా ఎదుట తన అవేదనను వెలిబుచ్చింది. నూతన సంవత్సర అగమనానికి స్వాగతం పలకాలని తామిద్దరమూ రోడ్డుపైకి వెళ్లామని, అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు తన భార్యను వేధించారని అమె భర్త చెప్పారు. సిసిటీవీ ఫూటేజీ అధారంగా పాషా సహా 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

సరిగ్గా సమయం 12 కొట్టగానే, రోడ్డుపైకి వచ్చిన యువకుల సంఖ్య పెరిగిపోయిందని, మరీ ముఖ్యంగా అల్లరి మూకలు న్యూఇయర్ రోజున రెచ్చిపోయాయి. యువతులు అధికంగా వున్న ప్రాంతాలకు వెళ్లిన అల్లరి మూకలు కావాలనే అమ్మాయిల మీద పడటం.. వారి దుస్తులను లాగివేసే ప్రయత్నాలు చేశారని బాధితులు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న యువతీ యువకులను అత్యంత తక్కువ సంఖ్యలో వున్న పోలీసులు నియంత్రంచలేక పోయారని.. అయితే తమను మాత్రం పోలీసలు అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారని బాధిత జంట అరోపించింది.

కాగా, తాము ఎదుర్కోన్న మానసిక, శారీరిక వేధింపులపై తాము పోలీసులకు పిర్యాదు చేస్తామని చెప్పారు. ఎందరో ఇలాంటి వేధింపులకు గురైనా.. వారంతా నిమ్మకుండిపోయే అవకాశముందని, తాము అలా వుండబోమని, తమను చూసైనా బాధిత యువతులు ముందుకు వచ్చి పిర్యాదు చేస్తారని జంట పేర్కొనింది. గత సంవత్సరం ఇదే బ్రిగేడ్ రోడ్డుతో పాటు ఎంజీ రోడ్డు తదితర ప్రాంతాల్లో అల్లరి యువకులు ఎంతో మందిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఎవరైనా రెచ్చిపోతే కనుక తాట తీస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేసినా, వేధింపుల ఘటనలు వెలుగుచూడటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suneel Kumar  sadhwani junction  Karnataka  brigade road  Bengaluru  Bangalore University  crime  

Other Articles