SBI cuts 30 bps in base rate కస్టమర్లకు ఎస్బీఐ న్యూఇయర్ గిప్ట్

Sbi cuts base rate by 30 basis points to 8 65 per cent

SBI, SBI interest rate, SBI loan, SBI rate cut, SBI lending rates, BPLR, 30bps, SBI loan rates, SBI home loan, SBI car loan, 30 basis point

The State Bank of India reduced the base rate and benchmark prime lending rates (BPLR) by 0.3 per cent each, which will benefit nearly 80 lakh of its existing customers.

ఖాతాదారులకు ఎస్బీఐ న్యూఇయర్ కానుక..

Posted: 01/02/2018 10:56 AM IST
Sbi cuts base rate by 30 basis points to 8 65 per cent

బ్యాంకింగ్ రంగ దిగ్గజం.. దేశీయ బ్యాంకుల్లో అతిపెద్దదైన భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తమ కస్టమర్లకు న్యూఇయర్ గిప్టును ఇచ్చింది. సరిగ్గా నూతన సంవత్సరం అవిర్భావాన్ని పురస్కరించుకుని ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. రుణాలు తీసుకున్న కస్టమర్లకు వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని కస్టమర్లకు తీపికబురును అందించింది. తమ బ్యాంకు బేస్ పాయింట్లను 0.3 శాతం (30 బేస్ పాయింట్లు) తగ్గించింది. ఫలితంగా 8.95 శాతం ఉన్న బేస్ రేట్ 8.65 శాతానికి చేరుకుంది.

బెంచ్ మార్క్ ప్రామాణిక కనీస వడ్డీ రేట్ల(బిపిఎల్‌ఆర్‌) 13.70 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. ఫలితంగా రుణాలపై వడ్డీ రేటు గణనీయంగా తగ్గనుంది. ఎస్బీఐ నిర్ణయంతో పాత బేస్ రేట్ ప్రకారం రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు లబ్ధి చేకూరనుందని బ్యాంకు రిటేల్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పికే గుప్తా తెలిపారు. ఈ నిర్ణయంతో ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు, గృహ రుణాలు తీసుకున్న వారు, విద్యార్థులకు పెద్ద ఊరట లభించనుందని అన్నారు. ఎస్బీఐ తాజా నిర్ణయం వెనువెంటనే అమల్లోకి వస్తుందని అన్నారు.

గత నెలలో ఎంసీఎల్ఆర్ ను తగ్గించిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ కు బేస్ రేటుకు మధ్య వత్యాసం చాలా వుండిందని, తమ తాజా నిర్ణయంతో ఈ రెండింటి మద్య గ్యాప్ తగ్గిపోతుందని అన్నారు. బేస్ పాయింట్లు తగ్గించినప్పటికీ అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా మంజూరు చేసే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్) ను మాత్రం 7.95 శాతం వద్ద అలాగే ఉంచింది. కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి, ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణాలను ఎస్బీఐకి మార్చుకునే వారికి ఇచ్చే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు గడువును మార్చి వరకు పొడిగించింది. కాగా, ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా బేస్ పాయింట్లను తగ్గించనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles