Diesel prices rise to a new record level డీజిల్ ధరకు రెక్కలు.. అల్ టైం హైకి చేరుకున్న ధర

Diesel prices rise to a new record level of rs 59 70 per litre in delhi

petrol prices, oil import, oil, India, diesel prices, diesel prices at record high, diesel prices at all time high, Nation, Current Affairs, India

Diesel prices have flared up to a new record level in Delhi while petrol, kerosene and jet fuel prices continue to rise in the country in line with the surge in global crude oilBSE -0.55 % prices.

డీజిల్ ధరకు రెక్కలు.. అల్ టైం హైకి చేరుకున్న ధర

Posted: 01/02/2018 09:45 AM IST
Diesel prices rise to a new record level of rs 59 70 per litre in delhi

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర సరుకుల ధరలను కేవలం 100 రోజుల్లోనే తగ్గిస్తామని, ఆ తరువాత నిరంతర పర్యవేక్షణ కూడా కొనసాగుతుందని చెప్పిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల ధరలను ప్రభావితం చేసే డీజిల్ ధరలను కూడా అంతర్జాతీయ మార్కెట్ల కు అనుగూణంగా పెంచనుండడంతో.. తొలినాళ్లలో తగ్గిన ధరలు.. ఆ తరువాత పెరుగుతూనే వచ్చాయి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. మునుపెన్నడూ లేని విధంగా ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటు నిత్యావసర సరుకులు కూడా పెరుతూనే వున్నాయి.

అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా పెరగడంతో, దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌, ఎల్పీజీ ఇంధన ధరలు భారీగా పైకి పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఢిల్లీలో లీటరు డీజిల్‌ ను రూ.59.70కు విక్రయించినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్థాయి. కోల్ కత్తా, చెన్నైలో కూడా డీజిల్‌ ధరలు నాలుగేళ్ల క్రితం నాటి గరిష్టాలను తాకి కొనసాగుతున్నాయి. మరోలా చెప్పాలంటే 2014 సెప్టెంబర్‌ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో కూడా డీజిల్‌ ధరలు 2017 మార్చి నాటి స్థాయిలను నమోదుచేస్తున్నట్టు తెలిసింది.

అదేవిధంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత్తా, మిగతా నగరాల్లో పెట్రోల్ ధరలు కూడా 2017 అక్టోబర్‌ 3 నాటి అ‍త్యధిక ధరలు పలుకుతున్నట్టు వెల్లడైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు రెక్కలు రావడంతో.. దేశంలో కూడా ఇంధనానికి రెక్కలు వస్తున్నాయి. కాగా, అంతర్జాతీయంగా ధరలు తగ్గిన క్రమంలో పలుమార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్రం.. కస్టమర్లకు కాస్త ఉపశమనం కల్పించడానికి అక్టోబర్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 తగ్గించింది. అయినా అంతర్జాతీయా మార్కెట్లో ధరలు పెరుగుతూనే వుండటంతో ఇటు దేశంలోని వాహనదారులపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్తితులకు వాహనదారులు చేరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol prices  oil import  oil  India  diesel prices  Nation  Current Affairs  India  

Other Articles