shock to BJP in Rajasthan civic by-polls బీజేపికి షాక్.. కాషాయపార్టీకి ధీటుగా ప్రత్యర్థి

Shock to bjp in rajasthan civic by polls as cong wins 12 seats

Rajasthan CM, Vasundara raje, Sachin pilot, Rajasthan civic bypoll results, PM Narendra Modi, sowbhagya yojana scheme, PM Modi, congress, BJP, rajasthan, latest news

The Opposition Congress has won 12 of the 26 seats in the local bodies by-elections held last week in Rajasthan. The ruling BJP has won an equal number of seats. An Independent has won unopposed.

బీజేపికి షాక్.. కాషాయపార్టీకి ధీటుగా ప్రత్యర్థి

Posted: 09/28/2017 11:33 AM IST
Shock to bjp in rajasthan civic by polls as cong wins 12 seats

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. ఇండియా అంటే బీజేపి అని, కాంగ్రేస్ విముక్త్ భారత్ అన్న తమ ప్రచార నానుడిని సాకారం చేసి చూపామని ముమ్మర ప్రచారం చేసుకోవాలని కలలు కంటున్న కమలదళానికి షాక్ తగిలింది. రాజస్థాన్ లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో అధికార బీజేపికి ఓటర్లు షాక్ ఇచ్చారు. అధికారం ఎవరికి ఇచ్చినా.. ప్రతిఫక్షాలు కూడా బలంగా వుంటేనే ప్రభుత్వాలు పనిచేస్తాయని విశ్వసించే ఓటర్లు తీర్పును కూడా అలాగే ఇచ్చారు.

రాజస్థాన్‌లోని పంచాయతీ ఉపఎన్నికల్లో బీజేపీ కుదేలైంది. ఇటీవల జరిగిన ఈ ఉపఎన్నికల్లో 26 స్థానాలకు గాను బీజేపీ కేవలం 12 స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్ సైతం పోటాపోటీగా 12 స్థానాలు గెలుచుకోగా, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. మరో సీటు ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఆసక్తికరంగా చారిత్రాత్మకంగా బీజేపీకి కంచుకోటైన ప్రాంతాల్లోనే ఈ ఉపఎన్నికలు జరిగాయి. అయితే నిరాశజనకంగా ఫలితాలు రావడం ముఖ్యమంత్రి వసుంధరా రాజేను ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.

 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీ సాధించిన విజయంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన గ్రామీణ ప్రజల్లో బలంగా ఉందన్నారు. రైతులపై ఏమాత్రం కనికరం లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల కేసులు 20 వరకూ నమోదయ్యాయని చెప్పారు. 2018లో రాజే పదవీకాలం ముగియడానికి ముందే ప్రజలు బీజేపీపై విశ్వాసాన్ని కోల్పోయారనడానికి తాజా ఫలితాలే నిదర్శనమని పైలట్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : civic bypoll results  vasundara raje  sachin pilot  congress  bjp  rajasthan  

Other Articles