Barack Obama admits to tearful goodbye with daughter Malia అగ్రరాజ్యానికి మాజీ అధ్యక్షుడినైనా.. అడపిల్లల తండ్రినే..

Dropping malia off at harvard was like open heart surgery says obama

barack obama, Malia Obama, Harvard University, beau biden foundation, open heart surgery, college, former US President

As parents dropped their kids off at college this fall, President Barack Obama said at an event for the Beau Biden Foundation, "It happens fast," "I dropped off Malia at college, and I was saying to Joe [Biden] and Jill [Biden] that it was a little bit like open-heart surgery."

అగ్రరాజ్యానికి మాజీ అధ్యక్షుడినైనా.. అడపిల్లల తండ్రినే..

Posted: 09/28/2017 10:51 AM IST
Dropping malia off at harvard was like open heart surgery says obama

అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా సేవలు అందించినా.. తన బిడ్డలకు మరీ ముఖ్యంగా కూతుళ్లకు తండ్రి అన్న విషయానికి వస్తే మాత్రం.. అకాశమంతా సినిమాలో తండ్రిపాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కనబర్చిన ప్రేమకన్నా అధికంగానే వుంటుంది. తండ్రి, తనయల మధ్య వున్న ప్రేమను ఎంత బలంగా పెనువేసుకుంటుందో ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే.. ఈ ప్రేమను విషయాన్ని సందర్భోచితంగా చెప్పారు అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.

గత ఎనమిదేళ్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన తన అధికార నివాసంగా వున్న శ్వేతభవనం నుంచి తన కూతుళ్లను పాఠశాలకు పంపారు. అయితే రెండు పర్యాయాలు అధ్యక్షునిగా సేవలందించిన తన పదవీ కాలం ముగియడంతో.. తన సొంతనివాసానికి మారిపోయిన ఒబామా.. తన కుమార్తె మలియాను కళాశాలలో చేర్పించినప్పుడు తాను కూడా భావొవ్వేగానికి గురయ్యాని, అయితే తన కనురెప్పాలు దాటి వస్తున్న కన్నీరును మాత్రం మాలియా కంటపడకుండా దాచేసుకున్నానని అన్నారు.

మాజీ ఉపాధ్యక్షుడు జోయీ బిడెన్ స్థాపించిన ‘బో బిడెన్ ఫౌండేషన్‌’ కోసం విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని విల్మింగ్టన్ లో నిర్వహించాగా.. ముఖ్య అతిథిగా హాజరైన ఒబామా మాట్లాడుతూ.. ‘మనకు ఆడపిల్లలు ఉంటే జీవితంలో అన్నీ వేగంగా జరిగిపోతుంటాయి. ఇటీవల నేను మలియాను కళాశాలలో చేర్పించాను. ఆ క్షణం నాకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తున్నట్లే అనిపించింది. అప్పుడు ఏడ్చేశాను కూడా. కానీ మలియా ముందు కన్నీరుపెట్టుకోలేదు. అది నేను గర్వంగా చెప్పుకోగలను. అది చాలా కఠినమైన క్షణం. జీవితం మొత్తంలో గుర్తుపెట్టుకునేది మన పిల్లల విశేషాలే.’ అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles