Pune Cop Arrest for Films Woman Constable Taking Bath | బాత్ రూంలో స్నానం వీడియో తీశాడు.. ఆపై...

Policeman films woman constable taking bath

Pune, Policeman, Films, Woman Constable, Taking Bath, Woman Constable Molestation, Bath Video Film, Constable Film Bathroom Video, Sameer Patel, Chaturshringi Police Station

Pune Policeman Films Woman Constable Taking Bath, Arrested. The woman filed an FIR with the Chaturshringi police station against constable Sameer Patel. The Pune police arrested him on molestation charges.

మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా...

Posted: 09/28/2017 08:53 AM IST
Policeman films woman constable taking bath

మహారాష్ట్రలో ఓ కానిస్టేబుల్ నిర్వాకం అతని అరెస్ట్ కు దారితీసింది. తోటి మహిళా కానిస్టేబుల్ ను స్నానం చేస్తుండగా వీడియో తీయటంతో కటకటాల పాలయ్యాడు. పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహిళా కానిస్టేబుల్ తన ఇంటిలో స్నానం చేస్తుండగా కానిస్టేబుల్ సమీర్ పటేల్ బాత్రూం కిటీకీ ద్వారా వీడియో తీశాడు. అది గమనించిన బాధితురాలు చత్రుష్రింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమీర్ వీడియో తీయటం తాను చూశానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వీడియో తీసినందుకు సమీర్‌తో ఆమె వాగ్వాదానికి దిగారని సీఐ దయానంద్ ధోమ్ తెలిపారు. వాగ్వాదంతో రెచ్చిపోయిన సమీర్ కుటుంబ సభ్యులు మహిళా కానిస్టేబుల్‌పై దాడికి దిగారని పేర్కొన్నారు.

ఆమె ఫిర్యాదుతో కానిస్టేబుల్ సమీర్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సమీర్‌ పై లైంగిక వేధింపుల కేసుతోపాటు అతడి భార్య, సోదరుడు, తల్లిపై సదరు మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు దయానంద్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles