high court orders to re-auction sadavarthi lands సదావర్తి భూముల కేసులో మరో మలుపు..

High court orders to re auction sadavarthi lands

high court orders to re-auction sadavarthi lands, sadavarthi lands, high court, auction, news papers, advertisements, all india brahmins sangham, RK Ramakrishna reddy

High Court of judiacture of hyderabad orders to re auction sadavarthi lands, with giving advertisements in national dailies awaring interested parties

సదావర్తి భూముల కేసులో మరో మలుపు..

Posted: 08/08/2017 01:15 PM IST
High court orders to re auction sadavarthi lands

సదావర్తి భూముల కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. ఈ కేసును విచారిస్తున్న రాష్ట్రోన్నత న్యాయస్థానం సదావర్తి భూములను మళ్లీ వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ పత్రికల్లో ప్రకటన ఇచ్చి ఆరు వారాల్లోగా వేలం పక్రియను నిర్వహించాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరోసారి వేలంలో పాల్గొనవచ్చని రాష్ట్రోన్నత న్యాయస్థానం సూచించింది. ఆయన చెల్లించిన రూ. 27.44 కోట్ల రూపాయలను బేస్ ప్రైస్ గా నిర్ణయించి వేలం నిర్వహించాలని అదేశించింది. ఈ వేలంలో పాల్గోనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో ఆ భూములను రామకృష్ణా రెడ్డికే చెందుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

గతంలోనే చెన్నైలోని సదావర్తి భూములకు సంబంధించి రూ.22.50కోట్లకు ఓ వ్యక్తికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం నిర్వహించింది. అయితే ప్రభుత్వం అతితక్కువ ధరకు భూములను
విక్రయించిందంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో తాము వేసిన వేలంకంటే మరో రూ.5కోట్లు ఎక్కువగా ఇచ్చినట్లైతే రామకృష్ణారెడ్డికి ఆ
భూములను అప్పగించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి భూములను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధరకు వేలం వేశారని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ముందుగా వీటిపై హకోర్టును అశ్రయించిన నేపథ్యంలో.. ఇవాళ తాజాగా ఈ భూములను బహిరంగ వేలం వేయాలంటూ ఆలిండియా బ్రాహ్మణ సంఘం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్రోన్నత న్యాయస్థానం జాతీయ పత్రికల్లో ప్రకటన ఇచ్చి ఆరువారాల్లోగా బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో మరోమారు సదావర్తి భూములను వేలం వేయడానికి అంద్రప్రదేశ్ ప్రభుత్వం సన్నధం అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sadavarthi lands  high court  auction  news papers  advertisements  all india brahmins sangham  

Other Articles