govt-accredited commission for protection of cows ఇకపై అధికార గోరక్షకులు.. గుర్తింపుకార్డులు కూడా..

Coming soon govt certified gau rakshaks in haryana and uttarakhand

Bharatiya Janata Party, BJP, cow protection, cow vigilantism, Gau Rakshaks, haryana, Narendra Modi, pm modi, pm narendra modi, Uttarakhand

While the exact powers of these certified gau rakshaks are yet to be put on paper, but it seems their word would be enough for the police to take action or, at least, start an investigation.

ఇకపై అధికార గోరక్షకులు.. గుర్తింపుకార్డులు కూడా..

Posted: 08/08/2017 02:52 PM IST
Coming soon govt certified gau rakshaks in haryana and uttarakhand

గో రక్షకులు పేరుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమేరకు చర్యలను ప్రారంభించాయి. ఇకపై గో రక్షకులను అధికారంకంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని గోవులను కబేళాలకు తరలించకుండా అడ్డుకునేందుకు ఏర్పడిన గో రక్షకులు ఇకపై దాడులకు తెగబడకుండా, వారి పనులను శాంతియుతంగానే చేయనున్నారు. ఇందుకోసం హర్యానా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. గోవుల తరలింపు, దాడులపై సీరియస్ గా స్పందించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి.

ఇకపై గో రక్షకులకు అధికారిక హోదాను కల్పించనున్నాయి ఆయా ప్రభుత్వాలు. అదెలా అంటే ఇక గో రక్షకులకు అధికారికంగా గుర్తించేందుకు ప్రభుత్వాలు గుర్తింపు కార్డులను జారీ చేయనున్నాయి. హర్యానాలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. హర్యానా గోవుల సంరక్షణ – సేవా సంస్థ చైర్మన్ భనిరామ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామని.. పరిశీలన తర్వాత గోరక్ష్ పేరుతో కార్డులు ఇస్తామన్నారు. తొమ్మిది జిల్లాల నుంచి 275 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 80 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

గో హింస, తరలింపులను పరిశీలిస్తారని.. గొడవలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. 13 జిల్లా నుంచి గో రక్షక్ జాబితా సిద్ధం చేయాలని జంతు హింస నిరోధక సభ్యుల సంఘాన్ని రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు కోరారు. వారి వినతి మేరకు గో రక్షకుల జాబితాను సిద్దం చేసి వారికి గుర్తింపు కార్డులను జారీ చేసే ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ గుర్తింపు కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయనున్నారు. దీంతో నకిలీ గోరక్షకులను నియత్రించడం సులభతరం అవుతుందని కూడా జంతుహింసా నిరోధక సభ్యుల సంఘం డైరెక్టర్ నరేంద్ర రావత్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cow-protection  Gau Raksha  Haryana  Narendra Modi  Uttarakhand  Violence  

Other Articles