AP CM chandrababu controversy comments on YS Jagan ప్రస్తుతం శాడిస్టు.. అధికారమోస్తే ఉన్మాది..

Ap cm chandrababu controversy comments on ys jagan

AP chief minister, CM chandrababu, controversy comments, AP opposition leader, YS Jagan, nandhyal by-elections, kurnool, Andhra pradesh, shilpa mohan reddy, bhuma bramhananda reddy, TDP, YCP, Politics

Andhra pradesh chief minister chandrababu naidu controversy comments on opposition leader YS Jagan at nandhyal by elections

ప్రస్తుతం శాడిస్టు.. అధికారమోస్తే ఉన్మాది..

Posted: 08/08/2017 01:13 PM IST
Ap cm chandrababu controversy comments on ys jagan

నంద్యాల ఉప ఎన్నికలో పర్వంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల వైసీపీ నేత జగన్ ఇక్కడకు ప్రచారానికి వచ్చి.. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయగా, అదే స్థాయిలో ఇవాళ సీఎం చంద్రబాబు కూడా తనదైన శైలిలో జగన్ ను తూర్పారబట్టారు. తాను చేసిన చెడు ఏమిటీ..? జగన్ చేసిన మంచి ఏమిటని ప్రజలను ప్రశ్నించారు. టీడీపీ పార్టీ నేతలతో అయన టెలీకాన్పరెస్సు నిర్వహించారు. ప్రతిపక్ష నేతలు చేసే రెచ్చగోట్టే వ్యాఖ్యలకు కార్యకర్తలెవ్వరూ స్పందించవద్దని, వారి సంగతి ప్రజలే తమ తీర్పుద్వారా ప్రకటిస్తారని అన్నారు.

ప్రతిపక్షంలో వున్నప్పుడే శాడిస్టులా ప్రవర్తిస్తున్న జగన్.. అధికారంలోకి వస్తే ఉన్మాదిలా మారుతారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలే చర్చించుకోవాల్సిన సమయం అసన్నమైందని చెప్పారు. జగన్ ఉన్మాది అని చెప్పడానికి అయన గతంలో చేసిన వ్యాఖ్యలే కారణమని చంద్రబాబు అన్నారు. అధికారులపై జులుం చేయడం, కలెక్టర్లను జైలుకు పంపుతానని చెప్పడం ఆయనలోని ఉన్మాదిని తలపిస్తుందని చెప్పారు. ఈ ఉప ఎన్నికలలో ప్రజాతీర్పు భూమా నాగిరెడ్డి అత్మశాంతించేలా ఇవ్వాలని అయన కోరారు.

టీడీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. భూమానాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే బరిలో నిలిచిన పార్టీలు.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలందరూ ఇప్పట్నించే సమాయత్తం కావాలని చంద్రబాబు సూచించారు. ప్రతిపక్షానికి చెందిన వైసీపీ క్రమంగా తన ఉనికిని కోల్పోతోందని చెప్పిన ఆయన... 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 30 సీట్లకు మించి రావని సర్వేలు తేల్చి చెబుతున్నాయని అన్నారు. టీడీపీ నేతలందరూ సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles