సస్పెన్స్ తర్వాత శిల్ప డెసిషన్ ఇచ్చేశాడు | TDP MLC Silpa Offcially Quit Party

Silpa chakrapani reddy quit tdp

TDP MLC Silpa Chakrapani Reddy, MLC Silpa Chakrapani Reddy, Silpa, Silpa Quit TDP, TDP MLC YSRCP, MLC Silpa, Silpa Brothers YSRCP, Silpa Chakrapani Srisailam

TDP MLC Silpa Chakrapani Reddy Quit Party. His Brother, YSRCP Leader Silpa Mohan Reddy invites brother Chakrapani later he decided after discuss with aides.

అఫీషియల్: టీడీపీకి శిల్పాచక్రపాణి గుడ్ బై

Posted: 08/02/2017 11:09 AM IST
Silpa chakrapani reddy quit tdp

సస్పెన్స్ కు తెరదించుతూ అన్న బాటలోనే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాసేపటి క్రితం ప్రకటించాడు. బుధవారం ఉదయం పార్టీకి రాజీనామా చేసిన ఆయన, తన కార్యకర్తలు, అనుచరుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.

పార్టీలో తనకు ఎంతమాత్రమూ ప్రాతినిథ్యం దక్కలేదన్న విషయాన్ని మరోసారి వినిపించాడు. కాగా, నిన్న ఆయన్ను బుజ్జగించేందుకు ఎంపీ సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు ప్రయత్నించగా, తనకు శ్రీశైలం అసెంబ్లీ టికెట్ గ్యారెంటీగా ఇస్తామని చెబితే, పార్టీలో ఉంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అటువంటి హామీ ఇప్పటికిప్పుడు కోరవద్దని, ఎన్నికల ముందు ఇటువంటి డిమాండ్లు వద్దని వారు సూచించినట్లు తెలుస్తోంది.

ఆపై తన కార్యకర్తలతో సమావేశమైన శిల్పా, చివరకు రాజీనామా వైపే మొగ్గు చూపారు. అదే సమయంలో వైసీపీలో చేరే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. శిల్పా బ్రదర్స్ ఎగ్జిట్ తో నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  MLA Silpa Chakrapani Reddy  Quit party  

Other Articles