'Witch-Hunt For 1 Seat', Says Congress' Ahmed Patel కర్ణాటక వ్యాప్తంగా 39 చోట్ల ఐటీ దాడులు..

It raids eagleton golf resort in bengaluru where congress gujarat mlas are staying

Eagleton Golf Resort, it raid, Income Tax raid, congress mlas, congress gujarat mlas, rajya sabha, karnataka, amit shah, narendra modi, rajya sabha polls, Ahmed Patel, Congress leader

Income Tax department today carried out raids at Eagleton Golf Resort in Bengaluru where Congress MLAs from Gujarat were shifted after six MLAs had resigned ahead of Rajya Sabha elections.

కర్ణాటక వ్యాప్తంగా 39 చోట్ల ఐటీ దాడులు..

Posted: 08/02/2017 11:41 AM IST
It raids eagleton golf resort in bengaluru where congress gujarat mlas are staying

గుజరాత్‌ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.. గుజరాత్ లో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకుని.. తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటుందని అరోపించిన నేపథ్యంలో వారిని బెంగళూరుకు తరలించిన కాంగ్రెస్ కు అక్కడ కూడా శరాఘతం తప్పలేదు. తాజాగా ఆ ఎమ్మెల్యేలు ఉంటున్న గదుల్లో ఐటీ శాఖ సోదాలు చేపడుతోంది. తొలుత కర్ణాటక మంత్రి ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు.. తర్వాతే ఎమ్మెల్యేల గదులను కూడా సోదాలు చేస్తున్నారు.

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ఇంటిపై ఇవాళ ఉదయం అదాయశాఖ అధికారులు దాడులు చేశారు. కనకపురాలోని సదాశివనగర్లో మంత్రి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి ఇంటికి సమీపంలో గల ఈగల్ టన్ గోల్ఫ్ రిసార్ట్ లో ఉంటున్న గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల గదులను కూడా తనిఖీలు చేశారు. కాగా.. గుజరాత్‌ నుంచి బెంగళూరు చేరుకున్న 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మంత్రి శివకుమార్ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అతని గదిని కూడా అదాయశాఖ అదికారులు తనిఖీలు చేశారు.

ఒక్క రాజ్యసభ సీటు కోసం బీజేపీ అసాధారణమైనరీతిలో దిగజారిన రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, అధినేత్రి సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ విమర్శించారు. ఒక్క స్థానం కోసం మొదట ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంది. ఇప్పుడు ప్రభుత్వ ఏజెన్సీని వాడుకుంటోందని అయన అరోపించారు. ఐటీ దాడులు బీజేపీ నైరాశ్యాన్ని, నిస్పృహను చాటుతోంది అన్నారు. గుజరాత్ నుంచి బీజేపి తరపున అమిత్ షా బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ బరిలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eagleton Golf Resort  it raid  congress  gujarat mlas  rajya sabha  karnataka  rajya sabha polls  BJP  Ahmed Patel  

Other Articles