నరసింహన్ కు ఢిల్లీ ప్రమోషన్.. కొత్త గవర్నర్ గా ఆ మాజీ సీఎం? | Telugu States to Get Second Woman Governor

Former cm of gujarat to become governor of telugu states

Anandiben Mafatbhai Patel, Telugu States New Governor, Telugu States Woman Governor, Anandiben New Governor, Anandiben ESL Naramismhan, Telangana Andhra Pradesh New Governor, Anandiben Patel Telangana Andhra Pradesh

Former Chief Minister of Gujarat Anandiben Mafatbhai Patel will reportedly be appointed as the Governor of Andhra Pradesh and Telangana relieving E S L Narasimhan. Prime Minister Narendra Modi is allegedly considering to give a significant position in Centre to Narasimhan.

మాజీ సీఎం తెలుగు రాష్ట్రాల గవర్నర్!

Posted: 07/25/2017 11:36 AM IST
Former cm of gujarat to become governor of telugu states

తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ రిలీవింగ్ నేపథ్యంలో కాబోయే తెలుగు గవర్నర్ ఎవరా? అన్న ప్రశ్న మొదలైపోయింది. ఆ మధ్య కర్ణాటక నేత శంకరమూర్తి పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు రేసులో మరో మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా వచ్చి చేరినట్లు హస్తిన నుంచి సంకేతాలు అందుతున్నాయి.

గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ కు ఆ పగ్గాలు అప్పగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ తర్వాత గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆనందీ అనుహ్య పరిణామాల మధ్య ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు సముచిత స్థానం కల్పించే భావనలో మోదీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు సీనియర్ బీజేపీ నేత శంకరమూర్తి కూడా ఈ రేసులో ఉండగా, ఆనందీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకు ముందు కుముంద్బెన్ జోషి తెలుగు రాష్ట్రాలకు పని చేసిన ఏకైక గవర్నర్ కాగా, పగ్గాలు చేపడితే ఈమె రెండో వ్యక్తి అవుతారు.

ఇక నరసింహన్ కు కేంద్రంలో ఏదైనా కీలక పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఆయనకు జాతీయ భద్రతా మండలి లేదా కేబినెట్ హోదా ఉన్న మరెదైనా పదవి ఆయనకు కట్టబెట్టొచ్చనే అంటున్నారు. ఇక మరో ఏడు రాష్ట్రాలకు గవర్నర్లను కూడా నియమించే అవకాశం ఉండగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లికి ఛాన్స్ దక్కొచ్చనే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu States Governor  ESL Naramismhan  Anandiben Patel  

Other Articles