డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్ థాంక్స్ | Diggy Raja Drug Case Tweet KTR Immediate Counter

Ktr satire on digvijay drug case allegations

Digvijay Singh, Digvijay Singh Tweet, Digvijay Singh TRS Leaders, Digvijay Singh Hyderabad Drug Case, Digvijay Singh Alleges TRS Leaders, Digvijay Singh KTR Tweets, KTR Digvijay Singh Drug Case Tweets, KTR Counter Digvijay Singh, KTR Satire Digvijay Singh, Digvijay Singh Telangana Government, Digvijay Singh Controversial Tweets

Congress Senior Leader Digvijay Singh's Tweet on Hyderabad Drug Case alleges TRS Leaders also involved in it. Immediately IT Minister KTR Counter to Diggy Raja and suggested to retire from Politics.

డ్రగ్స్ కేసులో గులాబీ టీం? కేటీఆర్ సెటైర్

Posted: 07/20/2017 11:17 AM IST
Ktr satire on digvijay drug case allegations

మాదక ద్రవ్యాల వ్యవహారంకు తెలంగాణనే కేంద్ర బిందువు అని తేలటంతో ప్రభుత్వం ఈ ఇష్యూపై చాలా సీరియస్ గా ఉంది. వ్యవహారంలో ఉంది ఎవరైనా సరే వారిని విచారించాల్సిందేనంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో ఇందులో టీఆర్ఎస్ నేతల హస్తం కూడా ఉందంటూ సంచలన ఆరోపణలే చేశాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఆయన చేసిన ట్వీట్ కలకలమే రేపింది.

"తెలంగాణలో భారీ డ్రగ్స్ స్కామ్ జరిగింది. ఇందులోని కొందరు ప్రముఖులకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో స్నేహం ఉంది. వారి ప్రమేయమూ ఇందులో ఉంది. ఇక వారిని ప్రాసిక్యూట్ చేస్తారో లేక వదిలివేస్తారో వేచి చూడాలి. చూస్తాను" అని ఈ ఉదయం ట్వీట్ పెట్టాడు. గతంలోనూ ఫేక్ సైట్లతో ముస్లిం యువకులను తెలంగాణ పోలీసులు ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదానికి తెరలేపాడు. ఇప్పుడు అధికార పార్టీపై చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో చూడాలి.

ఎట్టకేలకు నేర్చుకున్నాడు...

డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతలు ఇరుక్కున్నారని డిగ్గీ రాజా చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కేటీఆర్ జెట్ స్పీడ్ తో స్పందించాడు. దిగ్విజయ్ పూర్తిగా గతి తప్పారని, గౌరవప్రదంగా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు. తన వయసుకు తగ్గ పనులు చేసుకోవాలని సూచించిన కేటీఆర్, ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ ను ఆయన నేర్చుకున్నారని, అందుకు సంతోషమని సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. కాగా, గతంలో దిగ్విజయ్ చేసిన ట్వీట్ లో తెలంగాణ స్పెల్లింగ్ తప్పుగా ఉండటంతో కేటీఆర్ ఈ సెటైర్ వేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drug Case  Digvijay Singh  KTR  Tweet War  

Other Articles