మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ నగరంలో వాటి పిల్లర్లు.. వాహనదారుల పాలిట డేంజర్ బెల్స్ గా మారాయి. మెట్రో పిల్లర్లను ఢీకొన్ని జరుగుతున్న ప్రమాధాల సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతుంది. అయితే అనేక ఘటనలు చిన్నవి కావడంతో నేరుగా అస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ప్రమాదాల కారణంగా ప్రాణాలపైకి వస్తున్న ఘటనలు కూడా వున్నాయి.
తాజాగా ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ పరిధిలోని చైతన్యపురి వద్ద జరిగిన ప్రమాదం విషాధాన్ని నింపింది. చైతన్యపురి రోడ్డులో వస్తున్న ఓ కారు మెట్రో పిల్లర్ డీఎస్ఎన్ఎన్ఆర్-14 బిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. కాగా కారులోని మిగతా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మెట్రో పిల్లర్ కింద నిద్రపోతున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి రెండు కాళ్లపై నుంచి కారు వెళ్లడంతో అతని కాళ్లు పూర్తాగా దెబ్బతిన్నాయి. నడవలేని అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
నలుగురు మిత్రులు కలసి మారుతి స్విఫ్ట్ కారులో స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే కారు నడపుతున్న యువకుడు మద్యం మత్తులో డ్రైవ్ చేయడం మూలాంగానూ ఈ ప్రమాదం సంభవించిందన్నారు. దీనికి తోడు కారు కూడా అతి వేగంగా దూసుకువచ్చిందని.. అదుపుతప్పి పిల్లర్ ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్ట పోలీసులు చెబుతున్నారు. కారు నడిపిస్తున్న యువకుడ్ని అదుపులోకి తీసుకుని మద్యం సేవించాడా లేదా.. అన్న పరీక్షల నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more