Murder Supari for Money Laundering Mining Baron

Shekar reddy face life threat

Shekar Reddy, Shekar Reddy Money Laundering, Shekar Reddy Case, Shekar Reddy Murder, Shekar Reddy Bail, Shekar Reddy Relaxation, Shekar Reddy Life Threat, Shekar Reddy Murder Supari, Money Laundering Case 400 Crores Supari, Shekar Reddy Allegations, Money Laundering Shekar Reddy

Mining Baron Shekar Reddy, facing money laundering charges, for relaxing his bail condition that stipulated his stay in New Delhi only. Justice S Bhaskaran adjourned hearing on Reddys plea to July 17 on his counsel submission that he faced threat to his life.

శేఖర్ రెడ్డి హత్యకు భారీ ఫ్లాన్?

Posted: 07/13/2017 09:15 AM IST
Shekar reddy face life threat

జయలలిత మరణానంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఐటీ దాడుల గాలంలో ప్రముఖ కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు(ఇప్పుడు మాజీ) శేఖర్ రెడ్డి చిక్కిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున్న కొత్త నోట్లను మార్చుకునేందుకు ఆయన యత్నిస్తుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో తన హత్యకు భారీ కుట్ర జరుగుతోందని, దీనివెనుక కొన్ని రాజకీయ శక్తుల హస్తం ఉందని సంచలన ప్రకటనే చేశాడు.

ప్రస్తుతం బెయిల్ మీద ఢిల్లీలో ఈ మైనింగ్ టైకూన్ ఉన్న విషయం తెలిసిందే. తన బెయిల్ పై సడలింపు చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తన ప్రాణాలను ముప్పు ఉందని పేర్కొంటూ తనను చెన్నై లో ఉండేందుకు అనుమతించాలంటూ కోరాడు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు శేఖర్ తరపు న్యాయవాది జడ్జికి తెలిపాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో జైల్లో తనను హతమార్చాలని కొందరు చూశారని, 400 కోట్ల రూపాయల సుపారీ కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు. ప్రాణ హాని నేపథ్యంలో సరైన భద్రత కల్పించాలని విజ్నప్తి చేశాడు. అయితే బెంచ్ దీనిపై విచారణను 17కి వాయిదా వేసింది.

కాగా, డిసెంబర్ 9, 10 తేదీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్‌ రెడ్డి బృందం నుంచి 180 కోట్ల రూపాయల నగదు, 178 కిలోల బంగారం, వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, వివిధ పార్టీలకు చెందిన నేతలతో ఆయనకున్న సంబంధాలను తెలిపే పత్రాలు ఐటీ అధికారులకు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ భారీ ఆర్థిక నేరంలో మే 12న శేఖర్ బెయిల్ లభించగా, ఈడీ పరిధిలో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఢిల్లీలోనే ఉండాలంటూ జస్టిస్ భాస్కరన్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Money Laundering  Shekar Reddy  Life threat  

Other Articles