Indore Husband Lost his Wife in Gambling Raped

Husband lost his wife in gambling

Gambling, Husband Lost Wife, Husband Gambling Wife, Husband Lost wife in Gambing, Modern Mahabharata, Madhya Pradesh Husband, Indore Husband Gambling Wife, Wife Raped Husband Wish, Indore Police Public Hearing

Modern Mahabharata in Madhya Pradesh. Husband Lost his wife in gambling. Later two men rape and harassed her. She complained in Public Hearing.

పేకాటలో భార్య తాకట్టు.. రేప్

Posted: 07/13/2017 08:49 AM IST
Husband lost his wife in gambling

పురాణగాథ మహాభారతంను ప్రేరణగా తీసుకున్న ఓ జూదగాడు పేకాటలో తన భార్యను తాకట్టుపెట్టాడు. ఆపై ఓడటంతో వారికి అప్పగించగా, ఆ దుశ్వాస్సనులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

పేకాటకు బానిసైన ఓవ్యక్తి ఆట కోసం డబ్బుల్లేక భార్యపై పందెం కాశాడు. ఆపై తనపై గెలిచిన ఇద్దరికీ తన భార్యను అప్పగించాడు. నీ భర్త నిన్ను పేకాటలో ఓడాడు. నువ్వు ఇక మా సొంతం అంటూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో భర్త చేసిన పనికి ఆమె అతని నుంచి విడిపోయింది. అటుపై ఆ ఇద్దరూ పదే పదే ఆమెను వేధించటం మొదలుపెట్టారు. ఇండోర్ లో తరచూ పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో 38 ఏళ్ల ఆ మహిళ తనపై జరిగిన కిరాతకం వివరాలను వెల్లడించింది.

అయితే ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని ఇండోర్ పోలీస్ స్టేషన్ మహిళా ఇన్ ఛార్జి జ్యోతి శర్మ తెలిపారు. నిందితులపై ఆరోపణలు నిరూపించే సాక్ష్యాలు బలంగా లేకపోవటంతో విచారణ చేపట్టాకే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. భర్తతో పాటు కీచకులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Indore Husband  Gambling  Wife  

Other Articles