Tamil Nadu Governor orders Action on DMK plaint

Tn governor interfere in cash for vote scam

Tamil Nadu, Governer Vidyasagar Rao, Vidyasagar Rao Stalin, Vidyasagar Rao Cash for Vote, Tamil Nadu Horse Trading, Governer Vidyasagar Rao Speaker Dhanapal, Governer Vidyasagar Rao, DMK Plea cash for Vote Scam, Horse Trading Issue Tamil Nadu, Cash for vote AIADMK, Cash for vote Palani Swami

Tamil Nadu Incharge Governer Vidyasagar Rao refers DMK Chief Stalin’s plea to Speaker for action. DMK had requested the Governor to intervene and order a fresh vote of confidence and direct an investigation by the CBI into the offence under Prevention of Corruption Act, 1988.

అవినీతి సీన్ లోకి గవర్నర్!

Posted: 06/20/2017 11:39 AM IST
Tn governor interfere in cash for vote scam

తమిళనాడు రాజకీయాలను రసకందాయంలో పడేసిన ఎమ్మెల్యేల కొనుగోలు బాగోతం రాజ్ భవన్ కు చేరింది. ప్రతిపక్ష నేత స్టాలిన్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు మెమోరాండం సమర్పించగా, దానిపై విచారణ చేపట్టాల్సిందిగా స్పీకర్ ధనాపాల్ ను, చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ ను ఆయన ఆదేశించాడు.

రెండు టీవీ ఛానెళ్లు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అన్నాడీంకే ఎమ్మెల్యేలు శరవణన్, కనగరాజ్ లు పట్టుపడటం తెలిసిందే. దీనిపై జూన్ 17 న సమగ్ర సమాచారంతో స్టాలిన్ ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ను కలిసి విజ్నప్తి చేశాడు. దీంతో తన విశిష్ట అధికారాలకు పని చెప్పాడు గవర్నర్. అయితే విచారణ స్పీకర్ పరిధిలోనే జరుగుతున్నందున వ్యవహారం పక్కదారిపట్టే అవకాశం లేకపోలేదని డీఎంకే వాదిస్తోంది.

కాగా, దాదాపు రూ. 1000 కోట్లను ఎమ్మెల్యేలకు చెల్లించిన శశికళ, వారిని తన అదుపులోనే ఉంచుకున్నారని ఇటీవల స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించగా, విచారణకు ఆదేశించాలని అటు పన్నీర్ వర్గంతో పాటు డీఎంకే సైతం డిమాండ్ చేసింది. అంతేకాదు మళ్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. పళని స్వామి మాత్రం కొనుగోలు ఆరోపణలు అసత్యమని కొట్టి పడేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Governer Vidyasagar Rao  Horse Trading Issue  

Other Articles