EC not Encouraging Digital Payments for Presidential Election

No digital payments for presidential candidates

Election Commission, Presidential Election, Presidential Election Candidates, Presidential Election EC, Digital payments Presidential Election, No Digital Payments, Election Commission No Digital India

Digital payments: No Demonetisation effect on Presidential Election 2017, applicants ordered to deposit cash to file nominations

డిజిటల్ పేమెంట్.. చెల్లదు బాస్!

Posted: 06/19/2017 01:01 PM IST
No digital payments for presidential candidates

నల్లధనం, నకిలీ నోట్లు అంటూ కారణాలు చెబుతున్నప్పటికీ డిజిటల్ ఇండియాను ఎంకరేజ్ చేయడానికే నోట్ల రద్దు.. ఆపై పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్క రంగంలోకి క్రమక్రమంగా క్యాష్ లెస్ విధానాన్ని ప్రవేశపెడుతూ వినియోగదారులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో సత్ఫలితాలనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆర్థికవేత్తలు చెబుతుండటంతో జనాలు కూడా సర్దుకుపోతున్నారు.

ఇదిలా ఉంటే డిజిటల్ పేమెంట్లను ఎంకరేజ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈసీ చిన్న ఝలక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి డిజిటల్ పేమెంట్ చెల్లదంటూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రపతి అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ నిమిత్తం రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే సదరు అభ్యర్థులు చెల్లించాలని సంబంధిత అధికార వర్గాలను నుంచి ఆదేశాలు అందించింది.

డిపాజిట్ ను డిజిటల్ లేదా చెక్ రూపంలో చెల్లించేందుకు అనుమతిలేదని పేర్కొన్నాయి. కాగా, రాష్ట్రపతి పదవికి పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించే సమయంలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారి లెక్కించి సరి చూసుకుంటారు. అభ్యర్థులు చెల్లించాల్సిన మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయవచ్చు. సంబంధిత రసీదును నామినేషన్ పత్రాలకు జత చేస్తే సరిపోతుంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రపతి అభ్యర్థులుగా ఇప్పటికే 15 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, సరైన పత్రాలు లేనందున ఏడుగురి నామినేషన్లను తిరస్కరించేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Presidential Election  Election Commission  Digital Payments  

Other Articles