BJP may announced Advani Name as Presidential Candidate

Advani name for presidential race

LK Advani, Advani Presidential Candidate, Advani BJP, Advani President, BJP Presidential Candidate Finalized, BJP Presidential Candidate Finalised, BJP Presidential Candidate, NDA Presidential Candidate

LK Advani may finalised for BJP's Presidential Candidate. Posters supporting Lal Krishna Advani for the post of the president have come up at some prominent locations in Delhi.

రాష్ట్రపతి అభ్యర్థి అద్వానీ?. వాళ్ల పనేనా??

Posted: 06/19/2017 11:55 AM IST
Advani name for presidential race

ఎన్టీయే తరపున అభ్యర్థి పేరు చెప్పకుండా రాష్ట్రపతి ఎన్నికల సమరాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కమల ప్యూహానికి ఎట్టకేలకు తెరపడనుంది. ఎంతో మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్ఠానం... చివరకు ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మిత్రపక్షాలతో చర్చోపచర్చలు జరిపిన అనంతరం ఈ కురువృద్ధుడి పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం పేరును ప్రకటించే ఛాన్స్ ఉంది.

వాళ్ల డిమాండ్ మేరకేనా?

ఆర్ఎస్సెస్ మూలాలున్న అద్వానీ పేరు ఎప్పటి నుంచో రేసులో వినిపిస్తున్నప్పటికీ బాబ్రీ ఆరోపణల నేథప్యంలో ఆయనను పక్కన పెట్టాలని భారతీయ జనతా దళ్ పార్టీ నిర్ణయించింది. అయితే శివసేన ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయినట్లు అర్థమౌతోంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి శివసేన మద్దతునిస్తుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపిన అనంతరం ఉద్దవ్ ఠాక్రేను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదివారం భేటీ కావడం తాజా పరిణామాలకు ఊపిరిలూదింది.

తమ అభ్యర్థిని ఖరారు చేసే ముందు ఎన్డీయే మిత్ర పక్షాలు అన్నింటినీ తప్పకుండా సంప్రదిస్తామని ఉద్దవ్ కు అమిత్ షా హామీ కూడా ఇచ్చాడు. ఉద్దవ్ ను కలిసిన వారిలో అమిత్ షాతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రావ్ సాహెబ్ దన్వే ఉన్నారు. ఈ సమయంలో శివసేన యువ విభాగం చీఫ్ ఆదిత్య ఠాక్రే కూడా అక్కడ ఉండడం విశేషం. అద్వానీ లాంటి వాళ్లయితేనే ఏకపక్షంగా తమ మద్ధతు ఇస్తామని చెప్పటం, మిగతా మిత్రపక్షాలు కూడా అదే వాదనను వినిపించటంతో బీజేపీ అందుకు తలొగ్గినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఎన్డీయేలో ఐక్యత అవసరమన్న అభిప్రాయం వ్యక్తం కావటంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమౌతోంది. ఇక రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీజేపీ కీలక నేతలంతా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  LK Advani  NDA Presidential Candidate  

Other Articles