Pioneer of PILs in India Former CJI PN Bhagwati Passes Away

Justice pn bhagwati passes away

PN Bhagwati, PN Bhagwati PIL, PN Bhagwati Cases, PN Bhagwati Decisions, PN Bhagwati Emergency, PN Bhagwati Death News, PN Bhagwati Rules, PN Bhagwati Biography, ADM Jabalpur Case Details, Justice Bhagwati, Padma Vibhushan Bhagwati

Former CJI, PIL pioneer, Padma Vibhushan Bhagwati passes away at 95. Justice Bhagwati was also part of the five-judge bench which delivered a landmark judgement expanding the width of Right to Life in Maneka Gandhi case just two years after the ADM Jabalpur case.

‘పిల్’ పితామహుడు కన్నుమూత

Posted: 06/16/2017 10:34 AM IST
Justice pn bhagwati passes away

సీనియర్ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పీఎన్ భగవతి కన్నుమూశారు. 96 ఏళ్ల భగవతి కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గుజరాత్ లో జన్మించిన ప్రఫుల్లాచంద్ర నట్వర్ లాల్ భగవతి ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నాడు. 1967లో గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1973 లో సుప్రీం కోర్టు జడ్జిగా, 1985లో 17వ సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఆయన నియమితులయ్యారు. న్యాయవ్యవస్థలో మైలురాయిగా చెప్పుకునే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ను ప్రారంభించించి ఈయనే. పేదల తరపున గొంతుకను వినిపించేందుకు మూడో వ్యక్తికి ఆస్కారం ఇస్తూ ఆయన ప్రతిపాదనలు చేసి అమలుపరిచారు. అంతేకాదు ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 4ను సమర్థించిన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మినర్వా మిల్స్‌ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలో 42వ రాజ్యాంగ సవరణను సమర్థించిన ఒకే ఒక్క న్యాయమూర్తి జస్టిస్‌ భగవతి.

వీటితోపాటు కీలకమైన మేనకా గాంధీ కేసులో తీర్పు ఇచ్చిన బెంచ్ లో ఈయన ఉన్నాడు. 1986 డిసెంబర్‌ 20న పదవీ విరమణ చేసిన ఆయన తర్వాత నల్లకోటుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2007 లో ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. దిగ్గజ న్యాయకోవిదునిగా పేరున్న ఆయన మరణం పట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయనిపుణులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former CJI  Padma Vibhushan  Bhagwati  Death News  

Other Articles