ఛాన్స్ దొరికిన ప్రతీసారి మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పెట్టాలనే కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. అయితే తాము చేసే అభివృద్ధి పనులతో వాళ్ల ఆరోపణలు గాల్లోనే కొట్టుకుని పోతాయంటున్నాడు బెంగాలీీ సింగర్, భారీ పరిశ్రమల శాఖ(మినిస్టర్ ఆఫ్ స్టేట్) మంత్రి బాబుల్ సుప్రియో. ఒడిశా పర్యటనలో ఉన్న బాబుల్ మంత్రులపై జరుగుతున్న దాడులపై సీరియస్ గా స్పందించాడు.
మూడు రోజుల క్రితం మహానది జల వివాదం పై చర్చించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్రపారా జిల్లాలోని అవుల్ బజార్ కు వెళ్లాడు. మందాసార్ ఘటనకు వ్యతిరేకంగా బీజేడీ, కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో బీజేడీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ పై గుడ్లు విసిరి కొట్టగా, కాంగ్రెస్ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసింది. దీనిపై బాబుల్ ఘాటుగానే స్పందించాడు.
తాను మాంసాహారినని, ఒకవేళ ఎవరైనా తనపై గుడ్లు విసిరితే వాటితోనే ఆమ్లెట్ వేసుకుంటానని బాబుల్ సుప్రియో పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలతో భయపెట్టాలని భావిస్తే, తనలో ఇసుమంతైనా భయం కలగదని అన్నారు.ఇక్కడి( ఒడిశా) కంటే ఎక్కువ రాజకీయ సమస్యలు, స్తబ్థత ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్ నుంచి తాను వచ్చానని, ఎవరూ తనను భయపెట్టలేరని బాబుల్ స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more