Amazon India Compensate Customer in Cashback Case

Amazon india got penality on cashback cheat

Amazon India, Amazon India Compensate, Amazon India Cash-back Cheat, Cash back Cheat, Amazon India Hyderabad Customer, Hyderabad Customer, Cashback Third Party, Cash Back Cheat Amazon

Hyderbad Consumer Forum ordered Amazon India to compensate Customer for Cheating on name of Cashback.

అమెజాన్ ఛీటింగ్ కు దెబ్బపడిందిగా...

Posted: 05/22/2017 10:16 AM IST
Amazon india got penality on cashback cheat

క్యాష్‌బ్యాక్ ఆఫర్ కు టెంప్ట్ కానీ కస్టమర్ ఎవరైనా ఉంటారా? చెప్పండి. అయితే దాని వెనకాల ఉండేది కంపెనీ కాదని, థర్డ్ పార్టీ అని ఎంత మందికి తెలుసు? అయితే ఈ విషయంలో తమకేం సంబంధం లేదన్న క్షమించే ప్రసక్తే లేదని వినియోగదారుల ఫోరం తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మోసం చేసినందుకు గానూ వినియోగదారుడికి రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది.

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌కు చెందిన సుశాంత్ భోగా డిసెంబరు, 2014లో ఆపిల్ ఐఫోన్ 5సీ ఫోన్‌ను కొన్నాడు. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6500 క్యాష్‌బ్యాక్ వస్తుందని,24 గంటల్లో అది మీ ఖాతాలో అది జమ అవుతుందని అమెజాన్ పేర్కొంది. ఆపై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నాకే సుశాంత్ ఫోన్ కొనుగోలు చేశాడు.

కానీ, ఎలాంటి క్యాష్ బ్యాక్ జరగలేదు. దీంతో అతను 2015లో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలిలో ఫిర్యాదు చేశాడు. అక్కడా ఎలాంటి ఫలితం లేకపోవటంతో హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం-3ని ఆశ్రయించాడు. వాదనల సందర్భంగా తమకు, ఆ విక్రయానికి ఎలాంటి సంబంధం లేదని అమెజాన్ వాదించింది. క్యాష్‌బ్యాక్ అనేది మూడో వ్యక్తికి సంబంధించిన విషయమని కేవలం వారి వేదికగానే తాము ఉత్పత్తులను అమ్ముకుంటామని పేర్కొంది.

ఫోరం మాత్రం అమెజాన్ వాదనతో ఏకీభవించలేదు. వినియోగదారుడు ప్రకటనల సంస్థ మీదే నమ్మకంతో ఆఫర్లకు ఆకర్షిస్తులై కొనుగోలు చేస్తారని, మూడో వ్యక్తి గురించి వినియోగదారులకు తెలియదని, హామీలు అమలుకాకపోతే అది అక్రమ వ్యాపారం అవుతుందని పేర్కొంది. నష్టపరిహారం కింద 15వేలు,కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5వేలు మొత్తం 20,000 చెల్లించాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amazon India  Cash Back  Consumer Forum  Compensation  

Other Articles