KE Son's Name in Narayana Reddy Murder Case

Narayana reddy murder case police filed case

YSRCP Narayana Reddy, Narayana Murder Case, YCP Narayana Reddy, KE Krishnamurthy, KE Krishnamurthy Son KE Shyam Babu, KE Shyam Babu Police case, KE Shyam Babu Narayana Reddy Murder Case, KE Krishnamurthy Narayana Reddy, Narayana Reddy Last Riots, YS Jagan Narayana Reddy Funeral, YS Jagan Faction Murders, YS Jagan Meet Governor, Jagan Narasimhan Meet, Jagan Narasimhan, Chandrababu Faction Politics, Kurnool Narayana Reddy Murder

Police Filed against KE Krishnamurthy's Son KE Shyam Babu in Narayana Reddy Murder Case. YSRCP Alleges Police manipulates Shyam Babu main Culprit but mentioned A-14

నారాయణరెడ్డి మర్డర్.. కేఈ కొడుకుపై కేసు

Posted: 05/22/2017 09:28 AM IST
Narayana reddy murder case police filed case

కర్నూలు ఫాక్ష్యన్ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని కిరాతకంగా వెంటపడి మరీ సినీ ఫక్కీలో చంపటం తెలిసిందే. ఘటనలో అనుచరుడు సాంబశివుడు కూడా మరణించాడు. ఇక కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యామ్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యామ్ బాబు అని, అయినప్పటికీ అతన్ని ఏ-14గా చేరుస్తూ కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విచారణకు సహకరిస్తా: కేఈ

నారాయణరెడ్డి హత్యకు గురికావడం వెనుక ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఈ స్పందిస్తూ, ‘ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నాపై నిందలు వేస్తోంది. నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యలతో నాకు సంబంధం లేదు. వాళ్లిద్దరినీ నా అనుచరులే చంపారని విచారణలో తేలితే, వాళ్లకు శిక్ష పడేందుకు సహకరిస్తా. నారాయణరెడ్డికి గన్ మెన్ లను ఎస్పీ ఎందుకు తొలగించారో నాకు తెలియదు. ప్రాణహాని ఉందని నా దృష్టికి తెచ్చి ఉంటే తప్పక రక్షించేవాడిని’ అని తెలిపాడు.


ఎంత ఘోరంగా చంపారంటే...

పెళ్లికి వెళ్తున్న ఆయన్ను ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో చంపేశారు. నారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు సాంబశివుడును కూడా హత్య చేశారు. కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు నారాయణరెడ్డి తన స్వగ్రామం చెరుకులపాడు మీదుగా వెళ్తుండగా ప్రత్యర్థులు ట్రాక్టర్‌లో వెంబడించారు. క్రిష్ణగిరికి అర కిలోమీటరు దూరాన మరో ట్రాక్టర్‌తో నారాయణరెడ్డి వాహనాన్ని ఢీకొట్టించారు. అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో ముప్పేట దాడిచేశారు.

నారాయణరెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నారాయణరెడ్డి మృతదేహంపై 15కు పైగా కత్తిపోట్లు గుర్తించారు. తలపైనే అతి కిరాతకంగా ఎనిమిది సార్లు వేట కొడవళ్లతో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. చేతి చూపుడువేలు, మధ్య వేలు తెగిపోయాయి. సంఘటన స్థలంలో నారాయణరెడ్డి పుర్రె పగిలిపోయి మెదడు చిట్లి ఉండటంతో షాక్ కి గురయ్యారు. ఇక నారాయణరెడ్డి హత్యానంతరం తప్పించుకోబోయిన సాంబశివుడిని పొలాల్లో వెంటాడి నరికేశారు.

ఈ హత్యలతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ హత్యలకు కేఈ కుటుంబమే కారణమని హతుల బంధువులు ఆరోపించారు. హత్యలను వైసీపీ ఖండించింది. సోమవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. అంత్యక్రియలకు జగన్ స్వయంగా హాజరవు అవుతుండటం, ఆపై గవర్నర్ తో భేటీతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కేఈ కుటుంబమే ఈ హత్యలకు పాల్పడిందని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌ రెడ్డి ఆరోపించారు.ఇంకోవైపు ఇది బీహార్‌ ముఠా పనేనా..?అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల నిర్లక్ష్యమా? లేక...

నారాయణరెడ్డి తన రక్షణ తీసుకున్న లైసెన్స్‌డ్‌ ఆయుధాన్ని నెలరోజుల క్రితం రెన్యువల్‌ కోసం పోలీసులకు అప్పగించారు. ప్రతి ఏటా వెపన్‌లు ఉన్న వ్యక్తులు రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో నారాయణరెడ్డి వెపన్‌ను పోలీసు అధికారులకు అప్పగించారు. వారం రోజుల క్రితం కూడా పోలీసు అధికారులను కలిసి వెపన్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే పోలీసు అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles