ఢిల్లీ మహిళా ఎస్ఐపై లైంగికదాడి కేసు.. Court orders FIR against woman cop for sexual assault on girl

Delhi court orders fir against woman police officer for sexually assaulting minor

Delhi Rape, delhi student rape, delhi molestation, police woman rapes minor, policewoman rapes teen, policewoman, Sexual Assault, Molestation, crimes against women, crimes against women in india, crimes against women in delhi, FIR against police for rape, FIR against police for sexual assault crime

The minor girl has said the delhi women cop first sexually assaulted her and then took her to a hospital, where her internal medical examination was conducted without her consent.

ఢిల్లీ మహిళా ఎస్ఐపై లైంగికదాడి కేసు..

Posted: 04/18/2017 11:33 AM IST
Delhi court orders fir against woman police officer for sexually assaulting minor

13 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైందన్న వార్త వింటే ఎవరికైనా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాడిని కనీసం చెంపదెబ్బైనా కొట్టాలని భావిస్తారు. అదే పోలీసులైతే.. వాడ్ని చెడాపెడా వాయించిన తరువాతే దర్యాప్తు చేస్తారు. అలాంటి స్థానంలో మహిళా అధికారులే కనకవుంటే.. నిందితుడు ఎంతటి దారుణంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న విషయాన్ని న్యాయస్థానానికి కళ్లకు కట్టినట్లు తమ దర్యాప్తులో చూపించి నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటారు. కానీ దేశరాజధాని ఢిల్లీలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

దేశరాజధానిగా కన్న అత్యాచారాలకు రాజధానిగా మారిందని విమర్శలు వినబడుతున్న రాజధాని ఢిల్లీపైలో ఓ మహిళా పోలీస్ అధికారిని.. లైంగిక దాడి చేసిందన్న అభియోగాలను ఎదుర్కోంటుంది. బాధితురాలి సమ్మతి లేకుండా అమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడంతో పాటు అత్యాచారం చేసిన ప్రభుత్వ పాఠశాల టీచర్ కు లబ్ది చేకూరేలా దర్యాప్తును సాగించిందన్న అభియోగాల నేపథ్యంలో మహిళ పోలీసు అధికారిపై లైంగిక దాడి కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

తమ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తనపై లైంగిక దాడి చేశాడంటూ బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. సమాధానాలు చెప్పలేదంటూ స్కూలు అయినపోయిన తరువాత కూడా తనను పాఠశాలలోనే వుండాలని హుకూం జారి చేసిన ఉపాధ్యాయుడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కోంది. దీని గురించి ఫిర్యాదు చేసేందుకు తన తల్లిదండ్రులు రావడంతో వారిని బెదిరించాడని, తన తండ్రితో తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని కూడా తెలిపింది. అత్యాచారం కేసు నుంచి బయటపడేందుకు తనపై తండ్రే లైంగిక దాడి చేసినట్టు తెల్లకాయితంపై తప్పుడు రాతలు రాశాడని బాధితురాలు తెలిపింది.

ఈ కేసు విచారణాధికారిగా ఉన్న మహిళా పోలీసు అధికారి తనపై లైంగికంగా దాడి చేసిందంటూ బాలిక కోర్టుకు తెలిపింది. తనకు అన్యాయం జరిగిందని చెప్పినా.. పెడచెవిన పెట్టిన అధికారిని నిందితుడికి లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకున్నారని బాలిక ఏమాత్రం తడుముకోకుండా న్యాయస్థానంలో వెల్లడించింది. సదరు మహిళా ఎస్ఐపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్య తీసుకోలేదని నివేదించింది. దీంతో మహిళా ఎస్ఐపై కూడా లైంగిక దాడికేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఢిల్లీ పోలీసుశాఖను అదేశించింది.

లైంగికంగా దాడికి పాల్పడిన నిందితుడికి లబ్ధి చేకూర్చేలా తప్పుడు ఆధారాలు సృష్టించినందుకు సదరు మహిళా ఎస్సైపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కేసు దర్యాప్తు పురోగతిని తమకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా నిందితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనోజ్‌ రాఠీ మూడో బెయిల్‌ అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. బాధితురాలైన బాలిక ఈశాన్య ఢిల్లీలోని అమన్‌ విహార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఇక నిందితుడైన ఉపాధ్యాయుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు ఢిల్లీ పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Police  Sexual assault  Delhi  FIR  teacher  Manoj Rathi  crime  

Other Articles