హెచ్-1బీ వీసా.. ఇక ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు | Trump order would target high-skilled worker visa program.

Trump to sign executive order on reform of h 1b visa system

American President, Donald Trump, Donald Trump, Trump H-1B Immigration Visas, H-1B Immigration Visas, Buy American, Hire American, High-Skilled H-1B Visa, Trump Sign Executive Order, H-1B Visa Reform

American President Donald Trump will sign an executive order reviewing high-skilled H-1B immigration visas. Buy American, Hire American Executive Order Aims To Make Companies 'Hire American'.

హెచ్ -1బీ వీసా ఇక వాళ్లకు మాత్రమే...

Posted: 04/18/2017 10:34 AM IST
Trump to sign executive order on reform of h 1b visa system

హెచ్-1బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేవలం నైపుణ్యం, ఎక్కువ జీతాలు ఉన్న వాళ్లకు మాత్రమే వీసా జారీ చేయాలన్న కార్యనిర్వాహక ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేయనున్నాడు. విదేశాల నుంచి వస్తున్న ఉద్యోగుల కట్టడి విషయంలో ఫెడరల్ ఏజెన్సీ చేసిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (వలసవాదులకు బిగ్ షాక్)

‘అమెరికా ఫస్ట్’ పేరిట ఇమ్మిగ్రేషన్ పాలసీలో సంస్కరణలు తేవటం, తద్వారా అక్కడి వాళ్లకే ఉద్యోగాలు కల్పించటం లాంటి చర్యలకు ఇప్పటికే పునాది వేసిన ట్రంప్ రాను రాను ఆ సంస్కరణలు మరింత కఠినం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఉన్నత విద్య ఉండి నిపుణులై ఉండటమో లేక అధిక జీతాల ఉద్యోగులు అయి ఉంటేనే ఇక నుంచి హెచ్-1బీ వీసా జారీ చేస్తారు. అమెరికన్ ఉద్యోగుల రక్షణ పేరిట జరుగుతున్న ఈ వ్యవహారంతో భారత్ సహా 60 దేశాల నుంచి ఉద్యోగులను దిగుమతి చేసుకుంటున్నకంపెనీలకు గడ్డు కాలం ఎదురు కానుంది. ఇప్పటికే నిపుణులైన ఉద్యోగులని నిరూపించుకోవటానికి స్పెషలైజేషన్ నిబంధన అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఫెడరల్ కాంట్రాక్ట్ లను అనుసరించి తయారు చేసిన ఈ కొత్త చట్టంలో అమెరికన్ వస్తువులనే కొనటం- ఇక్కడి ఉద్యోగులనే అద్దెకు తీసుకోవటం(నియమించుకోవటం) అనే రూల్ ద్వారా విదేశీ ఉద్యోగులకు అవకాశం లేకుండా పోతుంది. అమెరికన్ ఉత్పత్తులనే ప్రజలు వాడేలా ప్రచారం చేయటంతోపాటు, విదేశీ ఉద్యోగుల దిగుమతిపై ఉక్కు పాదం మోపేలా ఆ ఆర్డినెన్స్ ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. వంద రోజుల పాలన దగ్గర పడుతున్నా పెద్దన్న ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలేవీ పడనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావం చేసే నిర్ణయాలను మాత్రం తీసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  H-1B Immigration Visa  High-Skilled  Executive Order  

Other Articles