ట్రంప్ ను బండ బూతు తిడుతూ స్పేస్ లో పోస్టర్.. ఎవరు చేశారో తెలుసా? | Space Group Protests Donald Trump From 90000 Feet Above Earth.

First protest in space targets trump

Donald Trump, Donald Trump Space, Donald Trump Space Troll, First Political Space Protest, Look at That You Son of a Bitch Donald Trump, Autonomous Space Agency Network Donald Trump, 90000 Feet Donald Trump, Anti-Trump Tweet in Space, NASA DOnald Trump

Donald Trump sparks protests again, this time 90000 feet above Earth. The Autonomous Space Agency Network (ASAN), an organisation that promotes “DIY space exploration”, has sent a message from space to Trump using a home-made weather balloon. ASAN is calling it the "first protest in space" against Trump.Look at that, you son of a bitch.

అంతరిక్షంలో కూడా ఆయన్ను వదిలిపెట్టరా?

Posted: 04/15/2017 10:38 AM IST
First protest in space targets trump

ఏప్రిల్ 12 1961 చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయిన రోజు. తొలి మానవుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రోజు. రష్యాకు చెందిన కాస్మోనాట్(రష్యా వ్యోమగామి) యూరీ గగరిన్ తొలిసారిగా 3కేఏ-3 స్పేస్ క్రాప్ట్ ద్వారా కాలుపెట్టాడు. అయితే ఆ రోజునే మరో రకంగా సెలబ్రేట్ చేసుకుందామని కొందరు భావించారు. అనుకున్నదే తడవుగా ఓ చిలిపి పని చేశారు. అదేంటో చూడండి...

అటానమస్ స్పేస్ ఏజెన్సీ వర్క్ అనే ఓ స్పేస్ సంస్థ భూమికి 90,000 అడుగుల ఎత్తులో ఓ వాతావరణ బెలూన్ ను వదలింది. సుమారు 120 క్యూబిక్ ఫీట్ హీలియంతో నింపిన ఆ బెలూన్ ను అఫ్రోడైట్ 1 అనే ఓ చిన్న వ్యోమగామి నౌక్ అంతరిక్షంలో వేలాడదీసి ఓ వ్యాఖ్యాన్ని సీపీఎస్ సెన్సార్ సాయంతో ట్వీట్ ను ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ను బండ బూతు తిడుతూ ఓ సందేశం అందులో ఉంది.

 

రాజకీయంగా నిరసనలు తెలపటానికి వాడిన తొలి స్పేస్ ప్రయోగంగా అఫ్రోడైట్ 1 నిలిచిపోయిందని ప్రయోగం తర్వాత సదరు సంస్థ ప్రకటించింది. చంద్రుడిపై నడిచిన ఆరో వ్యక్తి ఎడ్గర్ మిట్చెల్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో తెలియజేశాడు. ప్రజలను పీడించే నేతలను భూమికి దూరంగా లాకొచ్చి ఇలా అంతరిక్షంలో వేలాడదీయటం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఆయన అంతరిక్షంలో చెప్పిన మాటలను కాస్త మార్చి ఇదిగో ఇలా @realDonaldTrump: Look at that, you son of a bitch అంటూ వేలాడదీశారు. అయితే పైకి ట్రంప్ పై ఇలా నిరసన వ్యక్తం చేశామని వాళ్లు చెబుతున్నప్పటికీ తమ నిధుల్లో భారీగా కోత విధించినందుకే నాసా వెనకాల ఉండి ఇలాంటివి చేయిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  ASAN  Space Protest  Donald Trump  

Other Articles