బంగ్గీ జంప్ లో యువతి సేఫ్టీ తాడు ఊడింది.. ఆ భయంకర సీన్ ను మీరే చూడండి | Footage shows girl dangling by her feet after ride malfunctions.

Girl comes that close to losing head on carnival ride

Paris Carnival Ride, Paris Swing, Dangerous Swing, Girl Dangerous Swing, Girl Carnival Ride, Paris Dangerous Video, Dangerous Swing Video, Woman Horrible Video, Ride Malfunctions, Girl High-Speed Swing Ride

Girl survives after restraints fail on 100-foot high swing in Paris.

ITEMVIDEOS:గాల్లో ప్రాణాలు అలా అలా ఊగిపోతుంటే...

Posted: 04/15/2017 09:06 AM IST
Girl comes that close to losing head on carnival ride

మానవ తప్పిదం ఒక్కోసారి ఎంతెంత ప్రమాదాలకు దారి తీస్తుందో నిత్యం ఏదో ఒక వార్త రూపంలో మనం చూస్తున్నాం. అజాగ్రత్తతో వ్యవహరిస్తే నిండు ప్రాణాలు కోల్పోవటం తప్పించి మరేం మిగలదని అలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ మధ్య పారిస్ లో జరిగిన ఘటన సరిగ్గా ఇలాంటిదే అయితే ఇక్కడ ప్రాణాలు మాత్రం ఎలాగోలా దక్కాయి. అసలేం జరిగిందో చూడండి...

పారిస్ లో ది ఎడ్రినాలైన్ అనే ఓ ఉత్సవం జరుగుతోంది. అందులో భాగంగా ఓ సంస్థ కార్నివాల్ ను నిర్వహిస్తోంది. అక్కడ బంగ్గీ జంప్(గాల్లో వేలాటం) మాదిరిగా ఉండే రైడ్ ను నిర్వహించారు. తాడుకు కట్టి ముందుకు.. వెనక్కు, అటు.. ఇటు ఉయ్యలలా ఊపేయటం దీని స్పెషాలిటీ. ఇంతలో స్నేహితులతో అక్కడికి వచ్చిన ఓ మహిళ ఆ సరదా ప్రయాణంను ఎంజాయ్ చేద్దామనుకుంది. వెంటనే మరో ఫ్రెండ్ తో ఆ రైడ్ కు సిద్ధమైపోయింది.

 

సిబ్బంది వాళ్లను తాళ్లతో కట్టి అందులో కూర్చబెట్టారు. నెమ్మదిగా అది ఊగటం ప్రారంభించింది. అయితే ఒక్కసారిగా ఆమె నడుముకు ఉన్న సేఫ్టీ బెల్ట్ ఊడిపోవటంతో కిందకు వేలాడింది. ఆమెతోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేయటం ప్రారంభించారు. తల అక్కడే ఉన్న స్టేజీ అంచులకు తాకే అవకాశం ఉండటంతో ఆమెను రక్షించేందుకు సిబ్బంది యత్నించినప్పటికీ వీలు కాలేదు. అలా ఓ పది సార్లు ముందుకు వెనక్కు ఊగిన ఆమెను నిదానించిన తర్వాత కిందకు దించేశారు. ఒక చిన్న గాయం కూడా కాకుండా ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ, వంద అడుగుల ఎత్తు రైడ్ లో ఇంచులో ఆమె ప్రాణాలు గాల్లో వేలాటం మాత్రం భయానక అనుభవంగా మిగిలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris Woman  Dangerous Swing  Horrible Video  

Other Articles