చావును కూడా ఎంత ఫ్లానింగ్ తో ఫాలో అయ్యాడో.. | 72 Year Old Man Commits Suicide After Building a Tomb.

Built a tomb for himself 11 years ago now commits suicide

KJ Joseph Konur, Kerala Man Tomb, 11 Years Ago Tomb, Man Built Tomb, Kerala Man Suicide for Tomb, KJ Joseph Konur Death, Rationalist KJ Joseph Konur, Sathyathinte Vazhikal Author

Kerala rationalist, the 72-year-old KJ Joseph Konur who built a tomb for himself 11 years ago commits suicide by hanged himself to death.

ఆ పెద్దాయన ఎంత హాయిగా చచ్చాడో...

Posted: 04/14/2017 10:39 AM IST
Built a tomb for himself 11 years ago now commits suicide

11 ఏళ్ల క్రితమే తన కోసం సమాధిని నిర్మించుకుని, చావు కోసం ఎదురు చూపులు చూశాడు. చివరికి ఒపిక నశించటంతో బలనన్మరణంకు పాల్పడ్డాడు. కేరళలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్లితే.. 72 ఏళ్ల కేజే జోసెఫ్ కోనూర్ ఇడుక్కి జిల్లా లోని అదిమలీలో తన ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సామాజిక కార్యకర్త అయిన జోసెఫ్ 2006 లో తన ఇంటి ఆవరణలోనే సమాధిని నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి చావు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూడసాగాడు. అయితే అది తన చెంతకు రాకపోవటంతో ఫీలయిన దాని దగ్గరికే వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. వారం క్రితం పక్కా ప్రణాళికతో సూసైడ్ కు స్కెచ్ వేశాడు. ముందుగానే బంధువులను, స్నేహితులను మంగళవారం తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు.

శుభ్రంగా సమాధిని కడిగించాడు. అనంతరం సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు వదిలాడు. తన అంత్యక్రియలను ఏ మతాచారం ప్రకారం నిర్వహించవద్దని, హంగు, ఆర్భాటాలు అసలే వద్దని నోట్‌లో పేర్కొన్నాడు. అతని కోరిక ప్రకారమే ముందస్తు సమాధిలో కుటుంబ సభ్యులు అతన్ని ఖననం చేసేశారు కూడా.

దేవుడి పేరుతో దోచుకునే వారికి వ్యతిరేకంగా జోసేఫ్ ఉద్యమించేవాడని, చర్చి ఫాదర్ గా ఉన్న సమయంలో డబ్బును దారి మళ్లీయకుండా చూసుకున్నాడని, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా చనిపోవాలంటూ తరచూ అందరితో చర్చించేవాడని, చివరకు అలానే చేశాడని స్నేహితుడు సత్యన్ కోనట్టు తెలిపాడు. ఆ పెద్దాయన వ్యవహారం చూసిన వారంతా ముందు చూపు అంటే మరీ ఇంతలానా అని అంతా ముక్కున వేళ్లేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Man  KJ Joseph Konur  Suicide for Tomb  

Other Articles