దళిత జడ్జి న్యాయ వ్యవస్థను షేక్ చేసి పడేస్తున్నాడు | Karnan directs SC judges to appear before him.

Indian lower caste judge summons chief justice

Calcutta High Court, Justice Karnan Summon, Karnan Supreme Court Judges, Supreme Court versus Calcutta High Court, Karnan, Summons CJI, Six SC judges, High Court Judge, Dalit Judge Supreme Court

Calcutta High Court Justice Karnan Summons CJI Khehar, 6 Other Supreme Court Judges To Appear Before Him

సుప్రీంకోర్టుకే షాకులిస్తున్న జడ్జి

Posted: 04/14/2017 11:45 AM IST
Indian lower caste judge summons chief justice

కోల్ కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎస్ కర్నర్ మరోసారి వివాదాస్పదంగా మారాడు. ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ను తన ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశాడు. గురువారం ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించాడు. కర్నర్ కథేంటి?

గతంలో వివాదాస్పద ఆదేశాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచిన కర్నన్ పై గతంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టు ధిక్కారం కేసులో ఆయనపై అరెస్ట్ వారెంటు కూడా జారీ చేసింది. దీంతో రివెంజ్ చర్యలకు దిగిన కర్నన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ సహా మరో ఆరుగురు న్యాయమూర్తులను ఏప్రిల్ 28న కోల్‌కతాలోని తన నివాసంలో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసి కలకలం రేపాడు.

హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయిన తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఏంటని, అవసరమైతే తనని అరెస్ట్ చేసి బోనులో నిలపాలని వ్యాఖ్యలు చేశాడు కూడా. ఇక తీర్పు సందర్భంగా తనపై కుట్రపూరిత ఆదేశాలు జారీ చేసిన వారంతా తన ఎదుట హాజరుకావాలంటూ ఆదేశాలివ్వటం తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడు నుంచి తనని కోల్ కతాకు ట్రాన్స్ ఫర్ చేయటం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం తనపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసులు పెడతానని ప్రకటించడటంతో మరింత ముదిరింది.

అయితే ఓ హైకోర్టు న్యాయమూర్తికి దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ప్రశ్నించే పవర్ ఉందో లేదో స్పష్టంగా తెలీనప్పటికీ ఆయన దూకుడుకు సుప్రీం ఎలా కళ్లెం వేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Calcutta High Court  Justice Karnan  Summons  Supreme Court Judges  

Other Articles