ఈ ఫేక్ సీఎం అందరినీ ఎలా బకరాలనో చేశాడో తెలుసా? | When a look-alike of UP CM Yogi roamed in Varanasi.

Yogi adityanath look like a man fools people

Fake Yogi Adithyanath, Yogi Adithyanath Dupe, Varanasi People Fake Yogi, Fake Yogi Cheat, Yogi Adityanath Look alike Man, Yogi Adityanath Xerox, Fake Yogi Video, Fake Cm Fools People

Varanasi people greeted Yogi Adityanath's look-alike man as UP CM, showered flower petals on Fake Yogi.

ITEMVIDEOS:ఆ సీఎం డూప్ భలేగా బకరాలను చేసేశాడే!

Posted: 04/04/2017 02:57 PM IST
Yogi adityanath look like a man fools people

దేశంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ఇప్పుడు మాములు క్రేజ్ లేదు. సమస్య సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకోవటమే కాదు, యూపీలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని టాపిక్ లపై పోరాటాలు చేస్తూ దేశంలోని ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు. అయితే యోగి పేరుతో ఇక్కడ కొందరు చేసిన నిర్వాకంపై జనాలు సీరియస్ అవుతున్నారు. ఇంతకీ ఏం చేశారో చూడండి.

అచ్చం యోగి లాగానే ఉన్న ఓ వ్యక్తి వారణాసి వాసులకు పిచ్చోళ్లను చేయటం వివాదంగా మారింది. యోగి లా గుండుతో ఉండి, కాషాయం బట్టలు వేసుకున్న ఓ ఉన్న ఓ వ్యక్తి ఓ ఎర్ర లైట్ ఉన్న కాన్వాయ్ లో కూర్చుని ఉండగా, వెంట సెక్యూరిటీ గార్డుల్లాగా కొందరు వచ్చారు. అసలే యోగి హఠాత్తుగా ఊడిపడుతున్నాడు కదా! ఇది నిజమే కాబోలని యూపీ పోలీసులు సైతం ఆ డూప్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కూడా. చివరకు జనాలు కూడా తమ ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చాడేమోననుకుని పూలు చల్లి సాదరంగా ఆహ్వానం పలికారు.

 

చివ‌రికి అదంతా ఉత్తదేనని తెలుసుకున్న ప్రజలు, పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. అయితే ఓ సామాన్య వ్యక్తి ఇలా సీఎంలా మోసం చేయటం మంచిపరిణామం కాదని కొందరు మండిప‌డుతున్నారు. మార్చి 29న సాధువు జులేలాల్ జయంతి సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Adithyanath  Look alike Man  Varanasi Video  

Other Articles