సీఎం హమీ తర్వాత కూడా అగ్రిగోల్డ్ బాధితులతో ఏం మాట్లాడతాడు? | What Pawan discuss with AgriGold victims.

Pawan kalyan to meet agrigold victims today

Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan AgriGold Scam, Pawan Kalyan AgriGold Scam Victims, AgriGold Scam Janasena, AgriGold Scam Chandrababu Naidu, AgriGold Scam Pawan kalyan, Pawan Kalyan Chandrababu Naidu AgriGold Scam, AgriGold Scam AP Ministers, AgriGold Scam Victims, Pawan kalyan AgriGold Scam Victims, AgriGold Scam Victims Chandrababu Nadiu, AgriGold Victims Pawan Kalyan

Janasena Chief Pawan Kalyan to meet AgriGold scam victims.

అగ్రిగోల్డ్ బాధితులతో పవన్ ఏం మాట్లాడతాడు?

Posted: 03/30/2017 10:09 AM IST
Pawan kalyan to meet agrigold victims today

ఏళ్ల తరబడి నానుతున్న అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ స్పందించాడు. వారిని పరామర్శించి, న్యాయం జరిగేలా భరోసా ఇస్తూ, అవసరమైతే పోరాటానికి సిద్ధమని ప్రకటించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ మేరకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధితులు సమావేశం కానున్నారు.

ఇక బాధితులతో సమావేశమయ్యే సమయంలో చెల్లించాల్సిన డబ్బులను ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కడిగేసే ఛాన్స్ ఉంది. నోటి మాట కాకుండా హామీ ఆచరణ రూపంలో ఉండాలని కోరే అవకాశం ఉంది. పవనే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో తమకు సత్వర న్యాయం జరుగుతుందని బాధితులు కూడా భావిస్తున్నారు. కాగా, ఈ సభకు ఎంపికచేసిన 650 మంది బాధితులను మాత్రమే అనుమతించనున్నామని జనసేన వర్గాలు వెల్లడించాయి.

కాగా, అగ్రిగోల్డ్‌ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చాడు. స్థిరాస్తి వ్యాపారంతో ప్రజలకు ఎ అధిక వడ్డీ ఆశ చూపి 32లక్షల 2వేల 607మంది నుంచి రూ.6380 కోట్ల డిపాజిట్లు సేకరించారని, మొత్తం 9 రాష్ట్రాల్లో 32లక్షల మంది బాధితులు ఉన్నారన్నాడు. 2015 జనవరిలో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించగా, 2016 నుంచి అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రారంభమైందని వివరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేసులో ఇప్పటికే తొమ్మిదిమందిని అరెస్ట్‌ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల ప్రోత్సాహం ఇస్తామన్నారు. అవసరం అయితే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AgriGold Scam Victims  Janasena  Pawan Kalyan  

Other Articles