బ్యాంకుల సతాయించుడు.. పెళ్లి వుందన్నా పైసా ఇవ్వలేదు.. no restrictions on cash withdrawls, but bank officials deny to give cash

No restrictions on cash withdrawls but bank officials deny to give cash

reserve bank of india, state bank of india, demonetisation, bank officials, customers, cash withdrawls, telangana, RBI, Restrictions

Even after rbi restrictions comes to an end by march, bank officials restrict customers on withdrawls in telangana after five months of demonetisation

బ్యాంకుల సతాయించుడు.. పెళ్లి వుందన్నా పైసా ఇవ్వలేదు..

Posted: 03/24/2017 04:42 PM IST
No restrictions on cash withdrawls but bank officials deny to give cash

చేతిలో వుంటే అనవసరంగా ఖర్చుఅవుతాయ్.. ఇంట్లో వుంటే దొంగతనాలు జరిగే ప్రమాదాలు వున్నాయి.. మరి మా దెగ్గర వుంటే మీ డబ్బు భధ్రం.. సురక్షితం.. దీనికి తోడు ఎంతోకొంత వడ్డీ అదనం అంటూ ఉదరగొట్టే ప్రకటనతో యావత్ దేశపౌరులందరికీ అకౌంట్లు తెరచి డబ్బును భద్రపర్చుకున్న బ్యాంకులు.. అప్పట్లో మెక్కల్లాగా వున్నా ఇప్పుడు మర్రిచెట్టులా మారీ ఊడలతోనూ వేళ్లూనుకుంటూ.. దృఢంగా మారడంతో ఇక అయ్యా బాబు అంటూ అనాడు బతిమాలి అకౌంట్లను తెరిపించిన పరిస్థితులు మారి అకౌంట్ తెరిచేందుకు అప్లికేషన్ కూడా ఇవ్వని రోజులకు చేరుకునే సరికి బ్యాంకులు కస్టమర్లే తమకు దేవుళ్లు అన్న అసలు విషయాన్ని మర్చిపోతున్నాయి.

అహర్నిశలు కస్టపడి దాచిపెట్టిన డబ్బును బ్యాంకుల్లో దాచిపెట్టగా వాటిని కూడా తిరిగిఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ బ్యాంకుల్లో ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకంటున్నాయి. నవంబర్ 8న ప్రధాని మోడీ పాత పెద్ద నోట్ల రద్దు చేసిన తరుణంలో అనేక అంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరి 20 నుంచి పలు అంక్షల్లో సడలింపులు రాగా, మార్చి 1 నుంచి నగదు విత్ డ్రాల విషయంలో అంక్షలు పూర్తిగా రద్దయ్యాయి ఈ విషయం ముందుగా తెలిసేది బ్యాంకు సిబ్బందికే. ఆ తరువాతే కస్టమర్లకు తెలుస్తుంది. బ్యాంకులు తూచా తప్పకుండా అర్బీఐ నిబందనలు పాటించాల్సి వున్నా.. అందుకు మినహాయింపు వున్నట్లు తమ దయాబీక్షం మేరకే కస్టమర్లకు డబ్బులు వస్తాయన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురానికి చెందిన ఉమకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. నోట్ల రద్దు తరువాత బ్యాంకు అధికారుల్లో విపరీతమైన నిర్లక్ష్య దోరణి పెరగడంతో పాటు తమ దయాభీక్షం మీదే అధారపడి వున్నామన్నట్లుగా.. వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో వున్నది తమ డబ్బుగా భావిస్తున్న అధికారులు.. వాటిని ఇవ్వడానికి కూడా సుముఖంగా లేరు. తమ జేబుల్లోంచి డబ్బును ఇస్తున్నామట్లుగా అధికారుల తీరు కనబడుతుంది. ఉమ కూడా పెళ్లిబట్టలు, ఇతర ఖర్చులకు కోసం బ్యాంకు వెళ్లి డబ్బులు డ్రాచేసందుకు వెళ్లగా, అక్కడి మేనేజర్ డబ్బుల్లేవ్.. కావాలంటే 15 వేలు సర్ధుబాటు చే్స్తా అని చెప్పడంతో అమె అశ్చర్యానికి గురైంది.

డీమానిటైజేషన్ నేపథ్యంలో పెళ్లిళ్లు వున్నవారు తమ కార్డులు ఇతరాత్రా సాక్షాలను చూపించి డబ్బులను తీసుకోవచ్చని అర్బీఐ మినహాయింపులు కల్పించిన విషయాన్ని కూడా మర్చిపోయిన బ్యాంకు అధికారులు పెళ్లి వుందని, అందుకోసమే డబ్బు కావాలని చెప్పినా.. అంక్షలు లేని సమయంలోనే డబ్బులేవని చెప్పాడు. డబ్బ కావాలని ప్లజీ్ సార్ అంటూ ఉమ ప్రాధేయపడినా అ కరుడుగట్టిన హృదయం కనుకరించలేదు. అలస్యం చేస్తే 15 వేలు కూడా దొరకవు అంటూ చెప్పాడు. అయినా ఉమా బ్యాంకు మేనేజర్ ను బతిమాలడం అపలేదు. దీంతో నీకు ఫైసా కూడా ఇవ్వనని మెండికేసి.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండానే వెనక్కు పంపించేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles