హెల్మెట్ లేదని లంచం.. హైదరాబాద్ వీడియోకు 5 లక్షల హిట్స్.. ఆపై ఏం జరిగిందో తెలుసా? | A video of Hyderabad traffic cop taking a bribe goes viral.

Hyderabad traffic cop caught taking bribe and sacked

Hyderabad Traffic Police, Traffic Police Bribe, Cop Bribe Video, Sridhar Vemula Facebook, Hyderabad Traffic Video, Bribe Video, Hyderabad Bribe Video, Traffic Police Helmet, Hyderabad Traffic Police Video

Hyderabad Traffic Police is finally taking action against a cop who was caught on camera taking a bribe. The video, shot on a mobile phone, quickly went viral on social media after being posted to the official Facebook page of the Hyderabad Traffic Police last Friday. Sridhar Vemula, a Hyderabad resident, shared the minute-long video that shows a traffic cop pull over a middle-aged man on a two-wheeler for not wearing a helmet. After a few seconds of discussion, the man reaches for his wallet and appears to handover some cash. The traffic cop takes the money and lets the man go. At least three other traffic police personnel can be seen in the frame - but none of them appear to be aware of what is happening.

ITEMVIDEOS:ఫేస్ బుక్ వీడియోతో సస్పెండ్ అయ్యాడు

Posted: 03/25/2017 08:29 AM IST
Hyderabad traffic cop caught taking bribe and sacked

సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోవాలనే గానీ దాంతో కలిగే లాభాలు అంతా ఇంతా కావు. అయితే పర్సనల్ వ్యవహారాల పేరిట వాటిలో జరిగే కొన్ని మాత్రం క్రైం స్టోరీలకు దారితీస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రజలు దానిని విరివిగా వినియోగించుకుంటూ తమ అవసరాలను తీర్చేసుకుంటున్నారు. అందులో ఒకటి అవినీతి అధికారుల గుట్టు బయటపెట్టడం. రీసెంట్ గా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వ్యవహారంకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో వైరల్ అతని ఉద్యోగానికే ఎర్త్ పెట్టింది.

వివరాల్లోకి వెళ్లితే గత శుక్రవారం హిమాయత్ నగర్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ బృందం వాహనదారుల చెకింగ్ నిర్వహించింది. ఇంతలో బైక్ మీద వచ్చిన వ్యక్తిని హెల్మెట్ లేని కారణంగా అడ్డుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. వెంటనే అతగాడు మెల్లిగా కానిస్టేబుల్ చేతిలో లంచం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెనకాలే ఉన్నతధికారులు ఉండగా, వారు పట్టించుకోకపోవటం గమనార్హం. ఇదంతా ఓ కారులో కూర్చుని ఉన్న శ్రీధర్ వేముల గ‌మ‌నించి, తన ఫోన్‌లో చిత్రీక‌రించి మార్చి 17న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

అంతేకాకుండా హైద‌రాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌ పేజీకి ట్యాగ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా గంట‌ల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది. 5 ల‌క్ష‌ల మంది దానిని వీక్షించ‌గా, ప‌దివేల మంది షేర్ చేయ‌డం విశేషం. ఈ వీడియో చూసి స్పందించిన ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ జితేందర్ ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకుని లంచం తీసుకున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ద‌ర్యాప్తు అనంత‌రం చర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడే మరో వాదన వినిపిస్తుంది. లంచం తీసుకున్న వ్యక్తితోపాటు ఇచ్చిన వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోవాలని, అతని లైసెన్స్ రద్దు చేయాలని పలువురు కామెంట్ చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Traffic Police  Bribe Video Viral  

Other Articles