బెంగళూరులో మళ్లి మహిళలపై పేట్రేగిపోయిన అకతాయిలు Gang snatches woman's handbag outside mall

Gang attempsts to molest and run away snatching woman s handbag

IT capital, bengaluru, woman molestation, I phone, handbag, attempt stripping, attempt sexual assult, sexual harrassment, mg road, central bengaluru, lido mall, Halasuru police station

A woman waiting for a cab outside 1MG Lido Mall, off MG Road, central Bengaluru, was robbed by three men on a motorcycle on Wednesday night.

బెంగళూరులో మళ్లి మహిళలపై పేట్రేగిపోయిన అకతాయిలు

Posted: 03/24/2017 03:45 PM IST
Gang attempsts to molest and run away snatching woman s handbag

భారత దేశ ఐటీ రాజధానిగా బాసిల్లుతున్న బెంగళూరులో ఆకతాయిల అగడాలకు అంతం లేకుండాపోతుంది. మహిళలపై చులకనభావంతో పాటు వారిని అంగడి వస్తువులుగా పరిగణించే తత్వం ఇక్కడి రోమియోల్లో అధికంగా కనబడుతుంది. ఒంటరిగా వున్న మహిళ కనిపించినా.. లేదా ఒంటరిగా వున్న మహిళలు కనిపించినా.. పైశాచికత్వంతో మగమృగాళ్లు చెలరేగిపోతున్నాయి. వారిపై లైంగిక దాడులకు పాల్పడటమే తమ పని అన్నట్లుగా మహిళలను వేదిస్తున్నారు.

రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువతులను గమనించి వెనకగా వచ్చిన ఇద్దరు అగంతకులు వారిపై లైంగికదాడికి పాల్పడేలా చేసిన యత్నాలు సిసిటీవీల్లో చిక్కగా, దానిపై స్పందిచిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ఇక సీసీటీవి ఫూటేజీలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినవారెవరు అన్న కోణంలో కూడా తమ దర్యాప్తు సాగుతుందని చెప్పిన ఘటనను మర్చిపోక ముందే మరోమారు బెంగళూరులో అకాతాయిలు పేట్రేగిపోయారు.

తాజాగా ఓ హోటల్ ఎదురుగా రోడ్డుపై క్యాబ్‌ కోసం వేచిచూస్తున్న యువతులపై ముగ్గురు దుండగులు కీచకపర్వానికి పాల్పడ్డారు. ఎంజీ రోడ్డులోని హోటల్‌లో ఓ యువతి తన స్నేహితురాలితో కలసి డిన్నర్ ముగించుకుని ఇంటికి వెళ్లడానికి ఉబర్‌ క్యాబ్‌ కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అటుగా బైక్ పై వచ్చిన ముగ్గురు అగంతకులు వారి వద్దకు సమీపించి.. అసభ్యంగా ప్రపవర్తించారు. అమె దుస్తులను లాగేందుకు ప్రయత్నించగా, అనూహ్యంగా ఎదురైన ఈ పరిణామాన్ని అమె ధైర్యంగా ప్రతిఘటించింది.

ఈ క్రమంలో అమె పట్టుతప్పి పడబోగా, అమె స్నేహితురాలు పట్టుకుంది లేని పక్షంలో అమె రోడ్డుపై పడి గాయాలయ్యేవి. ఈ పరిణామానాన్ని తమకు అనువుగా మలుచుకున్న అగంతకులు బాధితురాలి హ్యాండ్ బ్యాగ్ ను లాక్కుని వెళ్లిపోయారు. అయితే వారిని ఉబర్ క్యాబ్ డ్రైవర్లు వెంబడించినా పట్టుకోలేకపోయారు. దీంతో వారు బాధితురాలితో పాటు అమె స్నేహితురాలని హలసూరు పీఎస్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles