శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు ఎగిరే అవకాశం పోయే.. Airlines Ban Shiv Sena MP Ravindra Gaikwad

Airlines ban shiv sena mp ravindra gaikwad with immediate effect today s ticket cancelled

shiva sena MP, Federation of Indian Airlines, Ravindra Gaikwad, banned, Air India, Airline Association, Shiv Sena MP

An association of airlines has decided that Ravindra Gaikwad, a Shiv Sena MP who assaulted a staff member of Air India, will not be allowed on flights "with immediate effect," a statement said.

శివసేన ఎంపీకి ఎగిరే అవకాశం లేదిక.. రవీంద్ర గైక్వాడ్ టిక్కెట్ రద్దు..

Posted: 03/24/2017 01:24 PM IST
Airlines ban shiv sena mp ravindra gaikwad with immediate effect today s ticket cancelled

ఎయిరిండియా సెక్యురిటీ అధికారిపై చెప్పుతో కోట్టడమే కాకుండా తీవ్రంగా విరుచుకుపడిన శివసేన ఎంపీ రవింద్ర గైక్వాడ్ ఇకపై విమానయాన అవకాశం కొల్పోయినట్లే. ఎయిరిండియా విమాన సంస్థ అధికారిపై ఆయన చేసిన దాడి ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. తాను చేసిన పనికి ఏమాత్ర పశ్చాతాపం లేకుండా.. ఒక్కసారి కాదు 25 సార్లు చెప్పుతో కోట్టానని, కేసు పెట్టుకుంటారా.. ఇప్పటికే తనపై చాలా కేసులున్నాయ్..? మర్డర్ కేసు పెట్టుకోండి అంటూ తేగేసి చెప్పడం కూడా కలకలం రేపింది.

ఈ ఉదంతం జరిగి దాదాపుగా 24 గంటలు కావస్తున్నా.. పార్లమెంటు సభ్యుడిపై విమానాశ్రయ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏకంగా విమానయాన సంస్థలే రంగంలోకి దిగి ఆయనపై చర్యలకు ఉపక్రమించాయి. ఇకపై ఆయన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఫెడరేషన్ అప్ ఇండియన్ ఎయిర్ లైన్స్ అడుగుముందుకేసి రవీంద్ర గైక్వాడ్ ఇకపై ఏ విమానాల్లోనూ ప్రయాణించేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

దీంతో ఎయిరిండియా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. అంతే.. గైక్వాడ్ పై మిగిలిన ఎయిర్ లేన్స్ సంస్థలన్నీ కూడా ఈ రద్దును పాటిస్తామంటూ ప్రకటించాయి. దీంతో ఇకపై శివసేన ఎంపీ విమానయానం చేయడం కుదరదని వార్తలు వస్తుండగా, తప్పు చేసింది ఎయిరిండియా అధికారి అని రవీంద్ర గైక్వాడ్ అన్నారు. తాను బిజినెస్ క్లాస్ టిక్కెట్ తీసుకోగా, తనను ఎకానమీ క్లాస్ లో సీటును ఎందుక కేటాయించారని ఆయన ప్రశ్నించారు. తాజాగా పెడరేషన్ అప్ ఇండియన్ ఎయిర్ లైన్స్ విధించిన నిషేధంపై స్పందించిన ఆయన తాను తప్పకుండా విమానయానం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh