యోగి ఫ్లస్సు.. మైనస్సులు.. సోషల్ మీడియాలో ఎలాంటి సెటైర్లంటే... | Satires on Yogi Adityanath in Social Media.

Social media discussion on up new cm yogi

Uttar Pradesh, New CM, Yogi Adityanath, Priest Yogi Adityanath, Bachelor CMs In India, Indian Bachelor CM, UP New CM Yogi, Yogi Adityanath, Satires on Yogi Adityanath, BJP Yogi Adityanath

Yogi Adityanath, priest of Gorakhpur became Uttar Pradesh Chief Minister. while CPI Criticise, Venkaiah praised him. Alia Bhatt Yogi jokes viral on social media.

పేదల పెన్నిధి VS ముస్లిం వ్యతిరేకి

Posted: 03/20/2017 08:48 AM IST
Social media discussion on up new cm yogi

చారిత్రాత్మక విజయంతో యూపీలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక చేయటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కున్నప్పటికీ, ఆరెస్సెస్ ఒత్తిడి మూలానా రాష్ట్ర రాజకీయాలను నడిపే సరైన నాయకత్వం ఆయనదేనని భావించిన కమలం ఆయనకు పగ్గాలు అప్పజెప్పింది. ఆదివారం ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూపీ అభివృద్ధే ధ్యేయంగా కలసికట్టుగా పనిచేస్తామని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను సాధిస్తామని, ఆయన ప్రకటించటం చూశాం.

అయితే యోగి ఇలా బాధ్యతలు స్వీకరించాడో లేదో అప్పుడే తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఆయనో ముస్లిం, దళిత వ్యతిరేకి అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపాడు. మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ బహిరంగ సభ లో సీతారాం మాట్లాడుతూ.. దళితులపై ఆర్ఎస్ఎస్, గోరక్షక దళాలు దాడులకు దిగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో యోగి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శమని పేర్కొన్నాడు.

మరోవైపు యోగిని వెనకేసుకొచ్చే పని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భుజాన వేసుకున్నాడు. పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తికి సరైన గుర్తింపు లభించిందంటూ కొత్త సీఎంపై ప్రశంసలు కురిపించాడు. అలాంటి వ్యక్తికి యూపీ సీఎం పదవి దక్కడం తనకు చాలా ఆనందంగా ఉందన్నాడు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతూ నిరంతరం ప్రజా సేవలో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ అని, ఇదే తరహాలో రాష్ట్రానికి ఆయన సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పాడు.


మరో బ్రహ్మచారి సీఎం...

పెళ్లికాని ముఖ్యమంత్రుల సంఖ్య మరోకటి పెరిగింది. దేశంలో బహ్మచారుల ముఖ్యమంత్రుల జాబితాలో తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకు వివాహానికి దూరంగా ఉన్న వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను మినహాయిస్తే మిగతా అందరూ బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, హరియాణా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి చెందినవారు. యోగి ఎప్పటి నుంచో సన్యాస జీవితాన్ని గడుపుతున్నారు. రాష్ట్రానికి తొలి బ్రహ్మచారి సీఎం కూడా.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అవివాహితులే. యూపీకి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కూడా వివాహం చేసుకోలేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వివాహం చేసుకున్నా కుటుంబానికి ఒంటరిగానే ఉండటంతో ఆ లిస్ట్ కిందకే వస్తాడన్న మాట.

కొత్త సీఎంపై జోకులు..

ఉత్తరప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ నియామకంపై ఓవైపు రాజకీయంగానే కాదు, సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పడుతున్నాయి. గతంలో షారూఖ్ ను పాక్ ఉగ్రవాదితో పోల్చటం, సూర్య నమస్కారం వ్యతిరేకించేవారు దేశం విడిచివెళ్లాలంటూ కామెంట్లు, పైగా మహిళా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించటం లాంటివి చేశాడు ఈ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి.

అయితే ఎప్పుడు గుండుతో ఉండే యోగి హాలీవుడ్ హీరో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్టార్ విన్ డిసిల్ ను పోలి ఉన్నాడంటూ కొందరు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. ఇతర దేశాల్లో జన్మించడం మినహా వీరిద్దరి రూపంలో ఎలాంటి తేడా లేదని పేర్కొన్నారు. యూపీ కొత్త సీఎం ఎవరు? అని బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ను అడిగితే.. ఆమె విడ్ డిజిల్ అని సమాధానం చెప్పినట్లు నవ్వులు పూయిస్తున్నారు. దీనిపై సీఎం ఫాస్ట్ అయితే మీడియా ఫ్యూరియస్ అవుతోందని ఆదిత్యనాథ్ మద్దతుదారులు కామెంట్ల వర్షం కుపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  New CM  Yogi Adityanath  

Other Articles