వర్షాలు. వరద.. బురద... 72 మంది మృతి... ఎంత ఘోరంగా ఉందంటే... | Peru floods: deadly downpour leaves thousands homeless.

Death toll rises to 72 in peru rains

Peru Floods, Peru Rains, Emergency Peru, Peru 72 Kill, Peru Flash Floods, Peru Floods Death Toll, Peru PM Speech, Peru Chile Bolivia

Worst floods in two decades kill 72 people in Peru. More rain forecast as struggles with catastrophic floods.

వరద.. బురద... 72 మంది మృతి

Posted: 03/20/2017 07:48 AM IST
Death toll rises to 72 in peru rains

వరదలతో అతలా కుతలం అవుతున్న పెరూ నష్టాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో అక్కడ కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు సుమారు 72 మంది మృతిచెందినట్టు ప్రధాని ఫెర్నాండో జవాల స్వయంగా ప్రకటించారు. వదర పొటుకు కంటే బురదలో చిచ్చుకుపోయి ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. దేశంలోని మొత్తం 811 నగరాలు ఎమర్జెన్సీ నడుస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని లీమాకు వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది.

సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. భారీ వర్షాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చిలీ, బొలివియాలు స్వచ్ఛందంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.

కాగా, ప్రస్తుతం దేశంలో 1998 నాటి వరదల పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించటం విశేషం. అప్పట్లో 374 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఇరుకైన నగరాలు, పైగా డ్యామ్ ల సంఖ్య పెద్దగా లేకపోవటంతో నదులు పొంగినప్పుడల్లా ఇలాంటి నష్టాలు జరగటం సర్వసాధారణం అయిపోయింది. వీటికి వంక చేసుకుని జైల్లో నుంచి కూడా ఖైదీలు పరారవ్వటం జరుగుతుందని, లాంబయక్ జైలు నుంచి ఇప్పుడు కూడా 22 మంది పారిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Peru Rains  Floods  72 Killed  

Other Articles