రెచ్చగొట్టి మరీ బూట్లు, చెప్పులతో కొట్టించాడు | PM Modi's photo hits with slippers.

Bihar minister insult pm narendra modi

Bihar Excise and Prohibition Minister, Abdul Jalil Mastan, Modi Photo Slippers, Abdul Jalil Mastan Video, Abdul Jalil Mastan Oust, Abdul Jalil Mastan Narendra Modi, Bihar Minister Narendra Modi,

Bihar Excise and Prohibition Minister and Congress Leader Abdul Jalil Mastan encouraged supporters to beat PM Modi's photo with slippers. Later apologised for his act after a day of massive furore in the Assembly. The BJP, however, is not satisfied with a mere apology from the minister but is demanding his expulsion from the Nitish Kumar Cabinet.

మోదీ అంటే అస్సలు లెక్కలేదా?

Posted: 03/02/2017 09:02 AM IST
Bihar minister insult pm narendra modi

రాజకీయాల వైరం సంగతి పెడితే , ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి పై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఓ రాష్ట్ర మంత్రి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడు. బీహార్‌ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి అబ్దుల్‌ జలీల్‌ మస్తాన్‌ నరేంద్ర మోదీని ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

రెండు రోజుల క్రితం పూర్ణియా జిల్లాలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్‌కు చెందిన ఈయనగారు మాట్లాడుతూ 50 రోజులు గడిచినా నోట్ల రద్దు కష్టాలు తీరలేదని, ఇందుకు శిక్షగా మోదీని బూట్లతో కొట్టాలంటూ పిలుపునిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కొందరు కార్యకర్తలు వెంటనే స్టేజిపైకి చేరుకుని అక్కడున్న మోదీ చిత్రపటాన్ని బూట్లతో కొట్టారు కూడా. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు మంత్రి తీరుపై మండిపడ్డారు.

అయితే ఆపై కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవటంతో అతగాడు క్షమాపణలు చెప్పాడు. కానీ, దీనిపై బీజేపీ శాంతించటం లేదు. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించినా, కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసినా బీజేపీ సభ్యులు శాంతించడం లేదు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలంటూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. దేశ ప్రధానిని అలా అగౌరవపరిచే హక్కు ఆ మంత్రికి రాజ్యాంగం కల్పించలేదని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ పేర్కొంటూ మంత్రి పదవికి అబ్దుల్ ఏ మాత్రం అర్హుడు కాదంటూ భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇంకోపక్క మస్తాన్ పై హాజీపూర్ కోర్టులో ఓ కేసు కూడా నమోదయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar Minister  Congress  Abdul Jalil Mastan  Narendra Modi Photo  Slipper Video  

Other Articles