రాజీనామా చేశాకే రాజ్ భవన్ కు రండి.. కేసీఆర్, బాబుకు పెద్ద షాక్ | Governor Narasimhan on party defictions

Governor narasimhan strict rules on party defictions

Governor Narasimhan, Narasimhan Defection MLAs, Telugu States Governor, Narasimhan Party Shifting MLAs, Governor Narasimhan Raj Bhavan, Narasimhan Strict Rules, Governor Narasimhan TRS TDP, Narasimhan Party Defections

Governor Narasimhan Strongly react on defection MLAs who wants Ministry. First resign then come to Rajbhavan.

గవర్నర్ నరసింహన్ సంచలన నిర్ణయం

Posted: 03/02/2017 10:13 AM IST
Governor narasimhan strict rules on party defictions

తమ భవిష్యత్తు కోసం అధికార పక్షంలో చేరుతున్న జంపర్లకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గట్టి షాకే ఇచ్చారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి విషయంలో నియామవళిని ప్రకటించాడు. రాజీనామా చేసిన తరువాత మాత్రమే మంత్రి పదవులు స్వీకరించేందుకు రాజ్ భవన్ కు రావాలని వారికి ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఏపీకి చెందిన ఓ సీనియర్ నేత విషయంలో ఆయన ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆపై మంత్రి పదవుల కోసం రాజ్ భవన్ కి రావాలి. ఆపై ఆరు నెలల్లో ఏదో రూపంలో ఎన్నికల్లో గెలవాలని నరసింహన్ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పాడంట. అలా కాకుండా మంత్రి పదవులు పొందాలని చూస్తే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని చెప్పడంతో ఫిరాయింపుదారులకు షాక్ తగిలినట్లయింది.

వైకాపా నుంచి గెలిచి, టీడీపీలోకి జంప్ అయిన కొందరు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, అవి స్పీకర్ తో ఆమోదం పొందిన తరువాతనే వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్పడంతో ఏం చేయాలోనని పార్టీ నేతలు తలపట్టుకుంటున్నట్టు సమాచారం.

గతంలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా అన్న కామెంట్ ను అనుసరించి.. తెలంగాణలో టీడీపీ టికెట్ తో గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో నరసింహన్ పై తీవ్ర విమర్శలు రావటంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు ఫిరాయింపులపై న్యాయస్థానంలో కూడా కేసులు నమోదవుతుండటంతోనే గవర్నర్ గట్టి నిర్ణయంతో ఉన్నారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు కాస్త ఊరట కలిగించేలా ఈ నిర్ణయం ఉందని పొలిటికల్ పండితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu States  Governor Narasimhan  Party Defictions  

Other Articles