వాలెంటైన్స్ డే సర్ ప్రైజ్.. లవర్ అరెస్ట్.. అసలు కథ వేరేలా ఉంది | Decorates Car With Rs 2000 Notes As A Gift For His Girlfriend.

Mumbai lover gets arrested for decorating car with new notes

Lover Decorating Car, Valentine’s Day New Notes, WhatsApp Fake Message, Valentine’s Day fake Message, Mumbai Lover Arrest, Rs 2000 Notes Car, ZAP Car, Mumbai Lover New Notes

Lover decorating car with Rs 2000 currency notes on Valentine’s Day 2017, Arrest. Later Confirmed total fake and WhatsApp message viral.

‘కొత్త నోట్ల’ ప్రియుడి అరెస్ట్.. అసలు కథ

Posted: 02/15/2017 08:29 AM IST
Mumbai lover gets arrested for decorating car with new notes

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన ప్రియురాలిని ఆకట్టుకోవాలని ప్రయత్నించిన ఓ బడాబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలి వద్దకు వినూత్నంగా వెళ్లి సర్ ప్రైజ్ ఇద్దామని భావించిన ప్రియుడు, తన కారును 2,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించి, బయలుదేరాడు. ఇంకా ప్రియురాలని చేరుకోకముందే రోడ్డు మీద పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు కరెన్సీని దుర్వినియోగం చేశాడంటూ అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇది వాట్సాప్ లో వైరల్ అయిన ఓ మెసేజ్ తో మీడియా ప్రచురించిన కథనాలు. మరి అసలు విషయం ఏంటంటే... ఓ క్యాబ్ సర్వీస్ వారు తమ ప్రమోషన్ లో భాగంగా ఇలా కారును డెకరేట్ చేశారు. అది కూడా ఒరిజినల్ నోట్లు కాదు సుమీ. జెడ్ఏపీ(జాప్) అనే సంస్థ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ కొత్త స్కీం ప్రవేశపెట్టి, దాని కోసం ఇలా వినూత్న ఆలోచన చేసి ప్రచారం నిర్వహించింది. ముందు అడ్డుకున్న పోలీసులు ఆ తర్వాత అర్థం చేసుకుని కారును వెళ్లనిచ్చారు కూడా.

అయితే కారును పోలీసులు ఆపిన సమయంలో అక్కడే ఉన్న కొందరు ఫోటోలు తీసి ఇలా వాట్సాప్ లో పెట్టడం, ఆపై స్థానిక మీడియా కథనాలు ప్రచురించటం, అటుపై అది కాస్త అంతా పాకిపోవటం జరిగాయన్న మాట. అందుకే వాట్సాప్ లో వైరల్ అయ్యే విషయాలను ముందు వెనుకా చూడకుండా ఇలా వైరల్ చేయకూడదని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Valentine’s Day  Rs 2000 Notes Car  Fake Whatsapp Message  

Other Articles