సింగిల్ రాకెట్ తో ఇస్రో అంతరిక్షంలో అద్భుతం | Record-breaking 104 satellites to launch on a single rocket.

Isro to launch record 104 satellites

PSLV C37, 104 Satellites, ISRO Record, Record Breaking Satellites, Russian Space Agency, 37 Satellites, Indian Rocket, The Indian Space Research Organisation, Satish Dhawan Space Centre, Sriharikota 104 Satellites, Satish Dhawan Space Centre Launch

India Poised to Launch 104 Satellites in One Day as Space War Intensifies. ISRO set to launch record satellites with PSLV C37 today. Compared to successful launch by the Russian Space Agency launching 37 satellites.

అద్భుత ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Posted: 02/15/2017 07:53 AM IST
Isro to launch record 104 satellites

ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాల కోట‌ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుతానికి సిద్ధమైపోయింది. మరికాసేపట్లో (ఉదయం 9.28 నిమిషాలకు) ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీహరికోట వేదిక కానుంది. ఎన్నో గణనీయమైన విజయాలు సాధించిన ఇస్రో మరో అద్భుతం చేయబోతోంది. ఒకే యత్నంలో అది కూడా కేవలం 28 నిమిషాల్లోనే 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించటమే కాదు, భూమికి పొరుగున ఉన్న శుక్ర, అంగారక గ్రహ యాత్రలపై దృష్టి సారించనున్నది.

ఇస్రో నమ్మిన బంటు పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) XI ద్వారా విదేశాలకు చెందిన 101 చిన్న ఉపగ్రహాలను, 3 దేశీయ ఉపగ్రహాలను కలిపి ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 714 కిలోల బరువైన కార్టోశాట్‌ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్‌ అయిన ఐఎన్ ఎస్‌–1ఏ, ఐఎన్ ఎస్‌–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ సాహసానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశమూ ఒకే దఫాలో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడానికి ప్రయత్నించలేదు. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ద్వారా అంతరిక్షంలోకి పంపించింది. అదే ఇప్పటివరకు ప్రపంచ రికార్డు.

ప్రయోగం ఎందుకంటే...

చైనాను అధిగమించేవిధంగా 2013లో భారత్ సొంతంగా మొదటిసారి అంగారక యాత్ర (మంగళ్‌యాన్) చేపట్టింది. మార్స్ ఆర్బిటార్ మిషన్‌ను ప్రయోగించి అద్భుతం సృష్టించింది. 2021-22లో రెండోదఫా అంగారక గ్రహయాత్ర చేపట్టాలని, ఈ సందర్భంగా ఒక రోబోను కూడా ఆ గ్రహంపై దించాలని అనుకుంటున్నారు. ఈ అనుభవంతోనే ఇప్పుడు సౌరవ్యవస్థలో రెండోదైన శుక్ర గ్రహాన్ని టార్గెట్ చేసింది.

ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన అంతరిక్ష విజ్ఞాన సంస్థ నాసా కూడా తప్పకుండా పాలుపంచుకుంటుందని ఆ సంస్థలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌కు డైరెక్టర్‌గా ఉన్న మైఖేల్ ఎం వాకిన్స్ తెలిపారు. ఈ నెలలో ఆయన భారత్‌ను సందర్శించారు. శుక్ర, అంగారక గ్రహయాత్రల గురించి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ ముందుగా ప్రతిపాదించారు. మానవులకు ఆవాసయోగ్యమైన మరో గ్రహం అవసరం ఉన్నది కాబట్టి ఈ అన్వేషణలో శుక్ర, అంగారక యాత్రల్లో భారత్ భాగస్వామి కావాలని అయన అన్నారు.

ఎలా ప్రవేశపెడతారంటే...

దీనిపై ఇస్రో ప్రాజెక్టు మేనేజ్‌మెంటు కౌన్సిల్‌ ఛైర్మన్‌, స్పేస్‌ కమిషన్‌ సభ్యుడు, వీఎస్‌ఎస్‌సీ సంచాలకుడు డాక్టర్‌ శివన్‌ వివరణ ఇచ్చారు. 104 ఉపగ్రహాలను ఒకే కక్ష్యలో ప్రవేశపెట్టడం సవాలేనని అన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి37 రాకెట్‌ ప్రయోగంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. అయితే అంత భారీ స్థాయిలో ఉపగ్రహాలను వాహకనౌక మోసుకెళ్లడం పెద్ద కష్టమైన పని కాదని ఆయన తెలిపారు.

అయితే వాటిని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడం సంక్లిష్టమైన ప్రక్రియ అని ఆయన తెలిపారు. అలా నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సమయంలో ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాకెట్‌ నుంచి ఉపగ్రహాలు వివిధ దశల్లో విడిపోతాయని ఆయన తెలిపారు. రాకెట్‌ నుంచి విడిపోయిన ఉపగ్రహ సాపేక్ష వేగం సెకనుకు మీటరు చొప్పున ఉంటుందని, వెయ్యి సెకన్ల తర్వాత ఉపగ్రహానికి, రాకెట్‌కు మధ్య దూరం వెయ్యి మీటర్లు అవుతుందని ఆయన చెప్పారు.

అలాగే మొదట విడిపోయిన ఉపగ్రహ సాపేక్ష వేగం తర్వాత విడిపోయే దానికంటే ఎక్కువని, దీంతో వేగాల మధ్య వ్యత్యాసం వల్ల ఉపగ్రహాల మధ్య దూరం కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహాలు పరిభ్రమించేది మాత్రం ఒకే కక్ష్యలో అని ఆయన తెలిపారు. ప్రయోగానంతరం 500 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్‌ వెళ్లాక ఒక కక్ష్య పూర్తి చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఈ 90 నిమిషాల వ్యవధిలోనే 104 ఉపగ్రహాలను వేర్వేరు సమయాల్లో సులువుగా కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. సంక్లిష్టమైన అంశమైనప్పటికీ అంతా సజావుగా సాగితే మాత్రం ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యయనం లిఖించినట్లే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  Sririharikota  104 Satellites  Launch  PSLV C37  

Other Articles