చిన్నమ్మ లేదా ఓపీఎస్.. బలనిరూపణకు ముందుగా ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే...| O Panneerselvam has won first round against Sasikala.

Governor c vidyasagar rao will have to insist on floor test

Sasikala-Panneerselvam, DMK Panneerselvam, Tamil Nadu Assembly Floor Test, DMK Panneerselvam, Sasikala Floor Test, Governor C Vidyasagar Rao, AIADMK Floor Test

Panneerselvam needs to stay calm for a win as Sasikala may face a tempest in court. Sasikala-Panneerselvam face-off intensifies, DMK calls for fresh election in Tamil Nadu

బలనిరూపణకు ఎక్కువ ఛాన్స్ ఎవరికంటే...

Posted: 02/10/2017 09:28 AM IST
Governor c vidyasagar rao will have to insist on floor test

అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళలు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు తమ వాదనలు వినిపించాక పరిస్థితులు మరింత వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ పంచాయితీని కేంద్రం దృష్టికి వెళ్లింది కూడా. ఇదే సమయంలో గవర్నర్ మరోసారి అడ్వొకేట్ జనరల్ ను కలిసి న్యాయ సలహా తీసుకోనున్నట్లు సమాచారం.

అక్రమాస్తుల కేసులో శశికళకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో అప్పటిదాకా వేచి చూసే ధోరణిని అవలంబించాలన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నాడేమోనని నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ఇద్దరూ సై అంటే సై అని కత్తులు దూసుకుంటుడటంతో తమిళ రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

బల నిరూపణకు పన్నీర్‌కు గవర్నర్ ఐదు రోజుల సమయం ఇవ్వనున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. మంగళవారం లేదంటే బుధవారాల్లో పన్నీర్ సెల్వం బలప్రదర్శన ఉండే అవకాశం ఉంది. అయితే అంతకుముందే అంటే సోమవారమే అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కేసులో శశికళపై కోర్టు తీర్పు వస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే ఆమె శకం ఇక ముగిసినట్లే. దీంతో పన్నీర్ సెల్వం పంట పండినట్టేనని చెబుతున్నారు. కానీ, కోర్టు తీర్పు శశికళకు అనుకూలంగా వచ్చినా, లేక వాయిదా పడినా చిన్నమ్మే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.

ఒకవేళ పన్నీర్ సెల్వం బలనిరూపణకు సిద్ధపడితే ఆయనకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సింది 118 మందే. కాబట్టి వారి మద్దతుతో పన్నీర్ సెల్వం గట్టెక్కడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రెండు రోజులుగా తన పట్టులో ఉంచుకున్న శశికళకు నెమ్మదిగా చిక్కులు ప్రారంభం అయ్యాయి. తమవాళ్లు మిస్సయ్యారంటూ ఫిర్యాదులు చేస్తుండటంతో మన్నార్ మాఫియాలో కలవరపాటు మొదలైంది. ఇదే సమయంలో సెల్వం మద్ధతుదారులు పెరగకుండా చూసుకోవాలన్న యత్నాలు బెడిసికొడుతున్నాయి కూడా. ఏదీ ఏమైనా నరాలు తెగే ఉత్కంఠ మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala  Tamil Nadu  Assembly Floor Test  AIADMK  

Other Articles