పన్నిర్ సెల్వం జట్టులోకి అన్నడీఎంకే సీనియర్ నేత senior mla madhusudanan supports panneerselvam visits camp

Senior mla madhusudanan supports panneerselvam visits camp

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, E Madhusudhanan, O.Panneerselvam, March 2012, VK Sasikala, letter, betray, vidyasagar rao, PM modi, Governor, tamil politics

senior AIADMK leader E Madhusudhanan joined the revolt against VK Sasikala by defecting to the side of O Pannerselvam, the caretaker Chief Minister, who is unwilling to give up his post,

పన్నిర్ సెల్వం జట్టులోకి అన్నడీఎంకే సీనియర్ నేత

Posted: 02/09/2017 01:49 PM IST
Senior mla madhusudanan supports panneerselvam visits camp

తమిళనాట రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రాజకీయ విశ్లేషకు అంచానాలకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి బయలుదేరిన నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠకు తోడు ఎవరు సీఎం అవుతారు.. అన్న సంధిగ్ధత కూడా ప్రజల్లో అంతకంతకూ పెరుగుకుపోతుంది. ఈ నేపథ్యంలో శశికళ క్యాంప్ నుంచి అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం క్యాంపులోకి సీనియర్ అన్నాడీఎంకే నేత రావడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో శశికళ ఎమ్మెల్యేల వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహాబలిపురం కల్పాకంలోని ఓ రిసార్ట్స్‌లో శశికళకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు క్యాంప్‌ నుంచి ఎంజీర్ నమ్మినబంటుగా వున్న మదుసూదనన్ అనే సీనియర్ నేత చాకచక్యంగా తప్పించుకుని  ఏకంగా పన్నీరు సెల్వం క్యాంపులోకి వచ్చి చేరారు. చిన్న పని ఉందని చెప్పి శశికళ క్యాంపు నుంచి వచ్చి పన్నీరు సెల్వం క్యాంపులో చేరడం.. అప్పటివరకు తన ఫోన్‌ స్విచాఫ్‌ చేయడం కూడా తన వ్యూహంలో భాగమేనని చివరకు చెప్పారు.

ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో కలసి మీడియా ముందుకు వచ్చిన మధుసూదనన్ తాను పన్నీరు సెల్వంకు మద్దతు తెలిపేందుకే కలిశానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని రౌడీల చేతుల్లోకి వెళ్లనీయబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలందరిపైనా వుందని అన్నారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడుతూ పోయిస్ గార్డెన్ ను అమ్మ స్మృతి భవనంగా మార్చాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే పోయిస్ గార్డెన్ ను అమ్మ మెమొరియల్ గా మారుస్తామన్నారు.

చిన్నమ్మగా కొనసాగుతన్న శశికళ.. అమ్మ జయలలితను వెన్నుపోటు పోడిచిందని అరోపించారు. శశికళ నిజంగానే తన బలాన్ని నిరూపించుకుంటే అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మారుతుందని ఆయన పేర్కోన్నారు. కాగా మధుసూదనన్ చేరికతో శశికళ క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇంకెంత మంది ఇలాంటి వారున్నారోనని ఆ వర్గంలో కలవరపాటు ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని పన్నీరు వర్గం దీమా వ్యక్తం చేస్తోంది.
 
ఈ 50 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు హోటల్‌ నుంచి రహస్యంగా బయటకు వెళ్లి, పన్నీరు వర్గంలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, శశికళ మాత్రం సాయంత్రం 5 గంటలకు చెన్నైలో ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌ రావుతో భేటీ కానున్నారు. తన వైపు ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకుని ఆమె గవర్నర్‌తో సమావేశం అవుతారని సమాచారం. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను శశికళ కోరనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles