లక్కు కలసోచ్చింది.. కానీ జీవితమే.. SP Agra Cantt candidate dies of heart failure

Samajwadi party s agra cantt candidate dies of heart failure

Chandrasen Taplu, Samajwadi Party, Agra Cantt legislative assembly, Mulayam Singh Yadav, Agra Development Authority, Medanta Hospital, Gurgaon

Chandrasen Taplu, whose name was in the list of election candidates announced by the Samajwadi Party from Agra cantonment seat, passed away on Thursday morning due to heart failure.

లక్కు కలసోచ్చింది.. కానీ జీవితమే..

Posted: 12/30/2016 07:32 PM IST
Samajwadi party s agra cantt candidate dies of heart failure

ఉత్తరప్రదేశ్‌లో ఓ సమాజ్‌ వాది పార్టీ నేత లక్కు కలసివచ్చింది. అయితే ఆ లక్కు ఎంతోసేపు నిలువలేదు. లక్కును అందుకునే క్రమంలో ఆయనకు జీవితమే లేకుండా పోయింది. లక్కు ప్రధాన ద్వారం గుండా వచ్చిరాగానే.. అప్పటికే అక్కడ తిష్టవేసిన యమపాశం అతని ప్రాణాలను బాక్ డోర్ నుంచి తీసుకెళ్లింది. తనకు ఎమ్మెల్యే టికెట్‌ వచ్చిందని సంబురాల్లో మునిగిన ఎస్పీ నేత ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. దాంతో అప్పటి వరకు సంబురాల్లో మునిగిన ఆయను కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు.

వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందటే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగ్రా కంట్‌ స్థానానికి చండ్రసేన్‌ తప్లు(45) అనే ఎస్పీ నేతకు టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆయన సంబురంలో మునిగిపోయారు. అందరితో కలిసి పార్టీ చేసుకున్నారు. ములాయంకు ధన్యవాదాలు చెప్పిన ఆయన తనకు సీటు వచ్చిన ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుంటూ సంతోషంగా గడిపారు.

కానీ, గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పగా సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ నుంచి గుర్గావ్‌ లోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇవ్వడంతో తీసుకెళుతుండగా మార్గమధ్యలో మధుర టోల్‌ ప్లాజా వద్ద ప్రాణాలు కోల్పోయారు. అతని మృతి పట్ల ములాయం సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles