ప్రధాని గారూ.. ఈ ప్రశ్నలకు బదులివ్వరూ.. Rahul Gandhi asks 5 questions to PM Modi

Rahul gandhi poses questions to pm on note ban a day ahead of his address

Rahul Gandhi 5 questions to PM Modi, narendra modi, demonetisation, modi speech december 31, rahul gandhi, pm modi, black money, pm modi, modi govt, note ban, currency ban, india news, latest news

Rahul sought to know as to who all deposited more than Rs 25 lakhs in bank accounts in six months preceding November 8 note ban decision.

ప్రధాని గారూ.. ఈ ప్రశ్నలకు బదులివ్వరూ..

Posted: 12/30/2016 08:31 PM IST
Rahul gandhi poses questions to pm on note ban a day ahead of his address

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నోట్ల రద్దు విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేశారు. ప్రధాని నోట్ల రద్దు ప్రకటన సమయంలో ప్రజలకు చెప్పిన 50 రోజుల సమయం ముగిసిపోవడంతో.. రాహుల్ ప్రశ్నలను సంధించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ప్రధానిపై  ప్రశ్నలను సంధించిన రాహుల్ మరోమారు తన ప్రశ్నల పర్వాన్ని కొనసాగించారు. పాతనోట్ల డిపాజిట్ చేసేందుకు గడువు ముగిపోయిన నేపథ్యంలో పాత పెద్ద నోట్ల రద్దు వల్ల చేకూరిన లాభం ఏమీటిని, ఏం సాధించారని, జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారంటూ ఆయన ప్రశ్నలను సంధించారు.

రాహుల్ ప్రధాని మోడీని నేరుగా సంధించిన ప్రశ్నలివే..?

1. నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నల్లధనం ఎంత బయటపడింది?
2. భారత్‌ ఆర్థికంగా ఎంత వరకు నష్టపోయింది? ఎంత మంది ప్రజలు ఆదాయ వనరులను కోల్పోయారు?
3. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంతమంది మరణించారు? వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందా? చెల్లించకుంటే ఎందుకు ఇవ్వలేదు?
4. పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని సంప్రదించిన నిపుణులు ఎవరు?
5. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు రెండు నెలలలో బ్యాంకుల్లో 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసిన వారి వివరాలు చెప్పండి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  rahul gandhi  pm modi  black money  pm modi  modi govt  note ban  currency ban  

Other Articles