పోలవరం ప్రాజెక్టు కీలక ఘట్టానికి సీఎం భూమిపూజ Polavaram spillway works get underway

Crucial phase of polavaram project construction begins

Polavaram project, water irrigation, Polavaram spillway, drinking water, lift irrigation, N Chandrababu Naidu, Andhra Pradesh

In a major initiative, spillway works on the multi-purpose Polavaram hydel project got under way in the presence of AP CM Chandrababu Naidu.

పోలవరం ప్రాజెక్టు కీలక ఘట్టానికి సీఎం భూమిపూజ

Posted: 12/30/2016 04:05 PM IST
Crucial phase of polavaram project construction begins

పోలవరం కీలక ఘట్టానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు. కీలకమైన స్పిల్ వే పనులకు ఆయన కాంక్రీటు వేసి పనులను ప్రారంభించారు. అనంత‌రం అక్కడి కార్మికుల‌తో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు రాతిమట్టి కట్ట చివర నుంచి స్పిల్ వేను 1054.40 మీటర్ల పొడవున నిర్మిస్తారు. స్పిల్‌వేను 150 అడుగుల ఎత్తుతో నిర్మించ‌నున్నారు. ఈ స్పిల్‌వేకు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంది.

పోల‌వ‌రం ప్రాజెక్టును 2019 చివ‌రి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ... 1.80 లక్ష‌ల మంది పోల‌వ‌రం నిర్వాసితులున్నారని, వారంద‌రికీ కొత్త చ‌ట్టం ప్రకారం పూర్తి న్యాయం చేస్తామ‌ని చెప్పారు. ముంపున‌కు గుర‌య్యే గ్రామాలు మొత్తం 262 అని చెప్పారు. వ‌ర్షపు నీటిని భూగ‌ర్భ జ‌లాలుగా మార్చుకోవాలని చెప్పారు. పోల‌వ‌రం జ‌ల విద్యుత్ కేంద్రంలో 80 మెగావా‌ట్ల కెపాసిటీ గల 12 యూనిట్లు వ‌స్తాయని ఆయ‌న చెప్పారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో కేంద్రం నుంచి ఇంకా రూ.217 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.

ఏ ఊరిలో ప‌డిన వ‌ర్షాన్ని ఆ ఊర్లోనే ఒడిసి ప‌ట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీని వ‌ల్ల భూగ‌ర్భ జలాలు పెరిగి.. నీటి క‌ర‌వు అనే మాటే ఉండ‌ద‌ని అన్నారు. నీటిని ర‌క్షించుకుంటే భ‌విష్యత్తులో మ‌న‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వని చెప్పారు. గోదావ‌రి నది నీళ్లు కృష్ణా, పెన్నాల‌కి వెళ్లాలని, ఎక్కడికక్కడ న‌దుల అనుసంధానం చేసి రాష్ట్రాన్నే ఒక వాట‌ర్ గ్రిడ్ గా త‌యారు చేసుకుంటే రాష్ట్రంలో క‌ర‌వు అనేదే ఉండ‌ద‌ని చెప్పారు. దాని కోస‌మే తాము ప్రయ‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. ఆ పనులు ముగిస్తే తాగునీటితో పాటు నిత్యావ‌స‌రాల‌కు నీటికొర‌త అనే మాటే ఉండ‌ద‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles