ఏపీ రాజకీయాల్లో మరో సంక్షోభం? | Arunachal Pradesh CM suspended from Party.

Arunachal pradesh cm pema khandu suspended by party

Arunachal Pradesh, CM Pema Khandu, People's Party of Arunachal, Pema Khandu suspended, Pema Khandu BJP, Pema Khandu, Arunachal Pradesh Crisis, Arunachal Pradesh CM suspended, PPA suspended Pema Khandu, CM and Deputy CM suspended, Pema Khandu anti-party activities, Pema Khandu joins BJP, Pema Khandu news, Arunachal Pradesh News, AP CM suspended, People's Party of Arunachal, Congress Arunachal Pradesh

People's Party of Arunachal (PPA) suspends Arunachal Pradesh CM Pema Khandu, and deputy CM, 5 others from primary membership on alleged anti-party activities.

ఆ ముఖ్యమంత్రిని ఏకంగా సస్పెండ్ చేసేశారు

Posted: 12/30/2016 08:10 AM IST
Arunachal pradesh cm pema khandu suspended by party

అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలు మరోసారి సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికార పార్టీ పీపుల్స్ పార్టీ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) నిర్ణయం వెలువరించింది. సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్, మరో ఐదుగురు శాసనసభ్యుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం సాయంత్రం ఓ ప్రకటన వెలువడింది.

పార్టీ రాజ్యాంగం ప్రకారం తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈ సస్పెన్షన్ విధిస్తున్నట్లు పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు కాఫా బెంగియా చెప్పారు. ఈ సస్పెన్షన్ తో పీపీఏ లెజిస్లేచర్‌ పార్టీకి నాయకుడిగా ఉండే అర్హతను సీఎం కోల్పోయారు. దీంతో మధ్యస్థ ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవటంతో సిద్ధంగా ఉండాలని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు పాడి రిచో కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.

కాగా, ఎంతో నమ్మకస్తుడైన నబమ్ టుంకీ ని సీఎం పదవి నుండి తొలగించి మరీ ఆ స్థానంలో యువకుడైన పెమా ఖండూని నిలబెట్టింది పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. జూలై 16న ఖండూ సీఎంగా బాధ్యతలు స్వీకరించాడు. అతను సీఎం అయ్యాక….రాహుల్ ని కలిసి మరీ థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. నమ్మకంతో సీఎం ను చేసిన ప్రేమ ఖండూ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి తన మద్ధతుదారులైన 44మందిని తీసుకుని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(బీజేపీ మద్ధతు ఉన్న పార్టీ) లో చేరిపోయాడు. ఇలా ఒక సీఎం మెజారిటీ సభ్యులతో వేరే పార్టీలో చేరిపోవటం దేశ చరిత్రలో తొలిసారి జరిగింది. దాంతో తాము సీఎం పీఠం నుంచి దించేసిన లుంకీ ఒక్కడే ఆ పార్టీ సభ్యుడిగా ఇప్పుడు ఉన్నాడు.

ఇక తాజా పరిణామాలను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీ రంగంలోకి దిగింది. పెమాకు తాము అండగా ఉంటామని ఆ పార్టీ ప్రతినిధి రాంమాధవ్ ప్రకటించాడు కూడా. 

Pema Khandu Suspended

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunachal Pradesh  CM Pema khandu  Suspended  People's Party of Arunachal  BJP  

Other Articles