రింగింగ్ బెల్- ఫ్రీడం 251... ఛీప్ స్మార్ట్ దుకాణం క్లోజ్? | Is It 'Game Over' for Freedom 251 Smartphones.

Freedom 251 maker mohit goel quits as ringing bells

Freedom 251, Ringing Bells, Freedom 251 Phone, Freedom 251 maker, Mohit Goel, Mohit Goel wife, Mohit Goel quit, Mohit Goel resigned, Mohit Goel Ringing Bells, Ringing Bells Mohit Goel, Mohit Goel Noida, Mohit Goel Freedom 251 scam, Ringing Bells SCam, Why Mohit Goel quit Ringing Bells, Game Over Freedom 251, Freedom 251 Phones, 2016 India Biggest Scams, Dharna Goel, Riningbells scam 2016, Modi Mohit Goel

Freedom 251 Founder, Managing Director of Ringing Bells Mohit Goel and his wife Dharna Goel quits from company.

ఫ్రీడం 251 ... సినిమా అయిపోయిందా?

Posted: 12/30/2016 08:42 AM IST
Freedom 251 maker mohit goel quits as ringing bells

రింగింగ్ బెల్ గుర్తుందా? కేవలం 251 రూపాయలకే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన నోయిడాకు చెందిన సంస్థ. దేశంలోనే అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ గా కాస్తలో రికార్డు కెక్కేదే. కానీ, ఏం జరిగిందో మొబైల్ ఫోన్ ఒకటి కూడా ఇంత దాకా సప్లై అయ్యింది లేదు. అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇక ఆ వ్యవహారం ఇంతటితో ముగిసిందనే అనుకోవాలి.

రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఈ ఆలోచన మూల కర్త మోహిత్ గోయల్ రింగింగ్ బెల్ కు రాజీనామా చేశాడు. అతనితోపాటు భార్య ధర్నా గోయల్ కూడా బయటికి వచ్చేసింది. అయితే తాము బయటికి వచ్చేసిన కంపెనీ కొనసాగుతుందన్న సంకేతాలను వాళ్లు అందించారు. ఈ సంస్థను అన్నదమ్ములు మోహిత్, అన్‌మోల్ కలసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారిద్దర మధ్య విభేదాల కారణంగా మోహిత్ బయటకు వచ్చేసిందంట.

దీంతో రింగింగ్ బెల్స్ సినిమా షెడ్డుకు చేరినట్లు చెప్పుకుంటున్నారు. కాగా, 2016 ఫిబ్రవరిలో మొబైల్ సంస్థల గుండెల్లో గుబులు రేపిన రింగింగ్ బెల్స్. ప్రస్తుత పరిణామాలతో కథ ఏడాది తిరగకుండానే ముగిసిపోయే ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే మోహిత్ సోదరుడు అన్‌మోల్ ప్రస్తుతం కంపెనీ ఇన్‌ చార్జ్‌ గా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అశోక్ చద్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు అందులో పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ ప్రకటించారు.

కాగా, టీవీలు, ఎల్ఈడీ వస్తువులు తయారు చేసిన ఈ కంపెనీ మోదీ డిజిటల్ ఇండియా పిలుపు తర్వాత మొబైల్ ఫోన్లపై పడిపోయింది. ప్రభుత్వం గనక 50,000 కోట్లను తమ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే గనక 75 కోట్ల మందికి ఫ్రీడం 251 ఫోన్లు అందజేస్తామని ఆ సమయంలో ప్రధాని మోదీకి మోహిత్ ఓ లెటర్ కూడా రాశాడు. ఉత్తర భారత దేశంలో ఇప్పటిదాకా 70,000 ఫోన్లను డెలివరీ చేసినట్లు సంస్థ చెబుతున్నప్పటికీ అందుకు సరైన ఆధారాలు లభించటం లేదు. పైగా 2 కోట్లకు సంబంధించి మోసం కేసును కోర్టులో ఎదుర్కోంటోంది రింగింగ్ బెల్స్.

కాగా, రింగింగ్ బెల్స్ నుంచి రాజీనామా చేసిన మోహిత్ గోయల్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించటం ఇక్కడ కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringing Bells  Freedom 251  Mohit Goel  Dharna Goel  Quit  Ringing Bells Scam  

Other Articles