కోడి పందేలపై హైకోర్టు బ్యాన్.. ఆడితే కఠిన చర్యలు | HC ban cock fights in Andhra Pradesh.

High court bans cock fights in andhra pradesh

cock fights, cock fights ban, Andhra Pradesh cock fights, cock fights Ban, cock fights High Court, High Court Andhra Pradesh cock fights, cock fights 2017, High Court cock fights, cock fights Supreme Court, No cock fights, cock fights in Telugu States, cock fights High Court, cock fights ban High Court, Andhra Pradesh Government Cock Fights

High Court hear petition to ban cock fights, and ordered Andhra Pradesh government to take appropriate measures for Sankranti.

కోడిపందేలపై హైకోర్టు నిషేధం

Posted: 12/26/2016 11:16 AM IST
High court bans cock fights in andhra pradesh

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సంచలనం నిర్ణయం వెలువరించింది. కోడిపందెలపై బ్యాన్ వేస్తూ తీర్పు వెలువరించింది. వాటి నిర్వహణను అడ్డుకోవాలని సూచిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పందాల పేరుతో మూగజీవాలను హింసిస్తున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మహా జూదానికి కొందరు రాజకీయ వేత్తలే ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తున్నారని, పోలీసులు కాపాలా కాస్తున్నారని, బాధ్యత గల పౌరులు జంతు హింసను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. పల్నాటి పౌరుషానికి ప్రతీకగా పేర్కొనే కోడి పందాలు అనేక సిని మాల్లో తెరకెక్కాయి. సంక్రాంతి సంప్రదాయం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం లో పెద్ద ఎత్తున సాగే ఈ కోడి పందాల ద్వారా సుమారు 300 కోట్ల బెట్టింగ్ పైగానే జరుగుతుందనేది ఓ అంచనా మాత్రమే.

గతేడాది జనవరిలోనే దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతికి నిర్వహించే కోడి పందేలను బ్యాన్ చేయాలన్న నిర్ణయంపై పై పందెం రాయుళ్లు కోర్టు వెళ్తారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cock fights  High Court  Ban  Andhra Pradesh Government  

Other Articles